సరికొత్త రికార్డు సృష్టించిన యూనివర్సల్ బాస్..!  

universal boss gayle sets new record Chris Gayle, IPL, 1001 Sixes, Archer Bowling, Polard, Mc Cullam, Andrew Russell, Rajasthan Royals - Telugu @henrygayle, 1001 Sixes, Andrew Russell, Archer Bowling, Chris Gayle, Ipl, Mc Cullam, Polard, Rajasthan Royals, Universal Boss Gayle Sets New Record

ఫార్మెట్ ఏదైనా సరే.గ్రౌండ్ ఏదైనా సరే.

TeluguStop.com - Universal Boss Gayle Sets New Record

బౌలర్ ఏ దేశానికి చెందిన వాడైనా సరే.అతడు బ్యాట్ ఝుళిపిస్తే బౌండరీ లైన్ అవతలే బాల్ పడేలా బాదుతాడు.ఇక ఇప్పటికే అతను ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.అదేనండి విండీస్ దేశపు ఆల్ రౌండర్, యూనివర్సల్ బాస్ గా పిలుచుకునే క్రిస్ గేల్.తన బ్యాట్ ఝుళిపించాడంటే ఆ రోజు ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మూడినట్టే.బాలు వేసేందుకు ఉరుకుతూ వచ్చిన సమయం కంటే తను బ్యాట్ తో కొడితే బాల్ బౌండరీ లైన్ అవతల పడే సమయం తక్కువ.

అంతలా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తిగా క్రిస్ గేల్ పేరుపొందాడు.

TeluguStop.com - సరికొత్త రికార్డు సృష్టించిన యూనివర్సల్ బాస్..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా యూనివర్సల్ భాస్కర్ క్రిస్ గేల్ సరికొత్త రికార్డును సృష్టించాడు.

ఇప్పటివరకు ఆడిన టి20 మ్యాచ్ లకు సంబంధించి ఏకంగా 1000 సిక్స్ లు బాదిన ఏకైక క్రికెటర్ గా తన పేరును లిఖించుకున్నాడు.కేవలం సిక్సుల సహాయంతోనే 6 వేల పరుగులు సాధించాలంటే అతని స్టామినా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

అతడి విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేము.ఇకపోతే టి – 20 క్రికెట్ చరిత్రలో సిక్సర్ల ఈ విషయంలో గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ లో ఆడుతున్న క్రిస్ గేల్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు.ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ కేవలం 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 99 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో భాగంగా తను కొట్టిన 7 సిక్స్ తో ఈ రికార్డును ఆయన సాధించాడు.ఇక ఈ లిస్ట్ లో అత్యధికంగా సిక్స్ లు కొట్టిన వ్యక్తి గా క్రిస్ గేల్ 1001 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత కివెన్ పోలార్డ్ 690, బ్రెండన్ మెక్ కల్లమ్ 485, షేన్ వాట్సన్ 467, ఆండ్రూ రస్సెల్ 447 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

#Archer Bowling #Andrew Russell #UniversalBoss #@henrygayle #Polard

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Universal Boss Gayle Sets New Record Related Telugu News,Photos/Pics,Images..