హెచ్ 1బీ వీసాదారుల వేతనాలు పెంపు: అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదన  

United States Department of Labor proposes increase in H-1B wages, H-1B wages, US Department, H1B visa, Donald trump - Telugu Donald Trump, H-1b Wages, H1b Visa, United States Department Of Labor Proposes Increase In H-1b Wages, Us Department

హెచ్ 1 బీ ఇతర వర్క్ పర్మిట్ హోల్డర్ల కనీస వేతనాలను పెంచాలని కోరుతూ అమెరికా కార్మిక శాఖ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్‌కు ఒక ప్రతిపాదనను సమర్పించింది.ఈ నిర్ణయం హెచ్ 1 బీ వీసా కార్యక్రమాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

TeluguStop.com - United States Department Of Labor Proposes Increase H 1b Wages

అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రచురించబడలేదు.నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఈ ప్రతిపాదనను క్లియర్ చేస్తుందని భావిస్తున్నారు.

ఇతర నిబంధనల మాదిరిగా కాకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండానే దీనిని వెంటనే అమలు చేస్తారని అంచనా.
ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ ఇతర కార్యక్రమాలతో పాటు అమెరికా అధ్యక్షుడి బడ్జెట్‌ను రూపొందించే పనిలో వుంది.హెచ్1, హెచ్ 1బీ1, ఈ 3, పీఈఆర్ఎం (ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డులు) యొక్క వేతన స్థాయిలను సమీక్షించాలని కార్మిక శాఖ ఈ ప్రతిపాదనను గత వారం సమర్పించింది.

TeluguStop.com - హెచ్ 1బీ వీసాదారుల వేతనాలు పెంపు: అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా హెచ్ 1 ఉద్యోగులను నాలుగు స్థాయిల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.2017కి ముందు, చాలా కంపెనీలు లెవల్ 1లో ఉద్యోగిని తీసుకోవడం ప్రారంభించాయి.అయితే 2017లో లెవల్ 1 ప్రోగ్రామ్‌లో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో లెవల్ 2కి మార్చారు.

ఇందులో వేతన స్థాయిల వ్యత్యాసం 10 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల మధ్య ఉంటుంది.ఇలాంటి విధానం చిన్న, మధ్యతరహా కంపెనీలు, స్టార్టప్‌లకు కష్టసాధ్యం.

ఇది హెచ్ 1 బీ కార్మికులను నియామకానికి ప్రతిబంధకంగా మారుతుందని ఇమ్మిగ్రేషన్ లాయర్ నందిని నాయర్ చెప్పారు.
హెచ్ 1 బీ వీసా మార్గదర్శకాలు, ఆంక్షలు, ప్రస్తుతం మార్కెట్‌లో వున్న అనిశ్చితి కారణంగా ఎన్నో భారతీయ టెక్ దిగ్గజాలు స్థానిక అమెరికన్ల రిక్రూట్‌మెంట్‌ను పెంచుతున్నాయి.

వ్యక్తి యొక్క అనుభవానికి తగినట్లుగా వేతనాలు నిర్ణయించబడాలని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాజీవ్ ఖన్నా అన్నారు.

యూఎస్ కార్మిక శాఖ విశ్లేషణ ప్రకారం.హెచ్ 1 బీ వీసాలపై ఉద్యోగులను నియమించుకునే ప్రతి ఐదుగురు యజమానులలో నలుగురు సగటు మార్కెట్ వేతనాల కంటే వర్క్ పర్మిట్ వున్న వారికి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు.

#H1b Visa #UnitedStates #Donald Trump #US Department #H-1B Wages

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

United States Department Of Labor Proposes Increase H 1b Wages Related Telugu News,Photos/Pics,Images..