అమెరికా : చికాగోకు పాకిన ఆటోవర్కర్స్ సమ్మె.. కొత్తగా స్ట్రైక్‌లోకి 7 వేలమంది కార్మికులు

డెట్రాయిట్ ఆటోమేకర్స్‌కు వ్యతిరేకంగా గడిచిన రెండు వారాలుగా సమ్మె చేస్తోంది యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్( United Autoworkers ).ఈ ఆందోళన మిచిగాన్‌లోని లాన్సింగ్ సమీపంలోని జనరల్ మోటార్స్ అసెంబ్లీ ఫ్యాక్టరీకి, చికాగోలోని ఫోర్డ్ ప్లాంట్‌కు కూడా పాకింది.

 United Autoworkers Strikes Spread To Chicago And Lansing As 7,000 More Workers J-TeluguStop.com

ఇక్కడ పనిచేస్తున్న 7000 మంది కూడా సమ్మె సైరన్ మోగించారు.యూనియన్ అధ్యక్షుడు షాన్ ఫెయిన్( Shawn Fain ) శుక్రవారం కార్మికులతో మాట్లాడుతూ.

చర్చలు సఫలం కాలేదని తెలిపారు.ఇకపోతే.

లాన్సింగ్ సమీపంలోని డెల్టా టౌన్‌షిప్‌( Delta Township )లో వున్న జీఎం ప్లాంట్‌లో చేవ్రోలెట్ ట్రావర్స్ వంటి భారీ ఎస్‌యూవీలను తయారు చేస్తుంది.ఇక్కడికి దగ్గరలోని మెటల్ భాగాల స్టాంపింగ్ ప్లాంట్ తెరిచే వుంటుందని ఫైన్ చెప్పారు.

చికాగో ఫోర్డ్ ప్లాంట్‌‌లో ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్, ఎక్స్‌ప్లోరర్ పోలీస్ ఇంటర్‌సెప్టర్‌లు, లింకన్ ఏవియేటర్ ఎస్‌యూవీని తయారు చేస్తుంది. ఎక్స్‌ప్లోరర్ ఇంటర్‌సెప్టెర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన పోలీస్ వాహనం.

ఫోర్డ్, జీఎంలు చర్చల్లో అర్ధవంతమైన పురోగతిని సాధించడానికి నిరాకరించాయని చెబుతూ రెండు కొత్త సమ్మె స్థానాలను వివరించారు.

Telugu Automakers, Chicago, Delta Township, Shawn Fain, Autoworkers-Telugu NRI

స్టెల్లాంటిస్‌తో గురువారం రాత్రి జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది.ఆటోమేకర్లు చివరిగా తెలిసిన జాబ్ ఆఫర్‌లు నాలుగేళ్ల కాంట్రాక్ట్ జీవితంలో దాదాపు 20 శాతం వున్నాయి.ఇది యూనియన్ డిమాండ్ చేసిన దానిలో సగం కంటే ఎక్కువ.

జీవన వ్యయం పెరుగుదలతో పాటు కొత్తగా నియమించబడిన కార్మికులకు నిర్వచించిన పెన్షన్‌ల పునరుద్ధరణ, యూనియన్‌లోని వేతనాల స్థాయిలకు ముగింపు వంటివి కూడా ఎజెండాలో వున్నాయి.కంపెనీలతో కొత్త కాంట్రాక్టులపై ఒప్పందాలు కుదరకపోవడంతో యూనియన్ సెప్టెంబర్ 15న సమ్మెకు దిగింది.

Telugu Automakers, Chicago, Delta Township, Shawn Fain, Autoworkers-Telugu NRI

సెప్టెంబర్ 14న రాత్రి 11.59 గంటలకు ఒప్పందాల గడువు ముగిసింది.యూఏడబ్ల్యూ( UAW ) ప్రారంభంలో ప్రతి కంపెనీ నుంచి ఒక అసెంబ్లీ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.గతవారం ఇది జీఎం , స్టెల్లాంటిస్ ద్వారా నిర్వహించబడే 38 విడిభాగాల పంపిణీ కేంద్రాలను కూడా సమ్మె పరిధిలోకి తీసుకొచ్చింది.

మూడు ఆటోమేకర్స్ కంపెనీలకు చెందిన దాదాపు 25 వేలమంది సమ్మెలో పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube