కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతున్న మాజీ సిఎం

సమైక్యాంధ్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించారు.రోశయ్య తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం మీదకి వచ్చిన ఆయన ఉద్యమ సెగని తట్టుకొని పరిపాలన సాగించారు.

 Unite Ap Last Cm Kiran Kumar Reddy Will Active In Congress-TeluguStop.com

అయితే తెలంగాణ విభజనని ఆయన ఆపలేకపోయారు.చివరి వారు బ్రహ్మాస్త్రం తన దగ్గర ఉంది అంటూ చెప్పి విభజన సమయంలో చేతులెత్తేశారు.

తరువాత కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి వ్యక్తిగత ఇమేజ్ తో సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికలకి వెళ్ళారు.అయితే ఆ పార్టీని ఏపీలో ఎవరు పట్టించుకోలేదు.

ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపొయింది.

ఆ తరువాత కొంత కాలం రాజకీయాలకి దూరంగా ఉంటూ తెరమరుగైన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకి ఉందు మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.

తరువాత ఒకటి రెండు సార్లు మీడియాలో కాంగ్రెస్ పార్టీ తరుపున హడావిడి చేసిన ఎందుకనో సైలెంట్ అయిపోయారు.అయితే రఘువీరారెడ్డి తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ పదవి అతనికే ఇస్తారని అందరూ భావించారు.

అనూహ్యంగా తెరపైకి సాకే శైలజానాథ్ వచ్చారు.ఇదిలా ఉంటే మళ్ళీ కిరణ్ కుమా రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది.

ఏపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో అధిష్టానం అతనికి కూడా అవకాశం ఇవ్వడంతో ఈ మాటకి బలం చేకూరుతుంది.మరి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏపీలో ఎంత వరకు బ్రతికించగలడు అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube