స్పెషల్‌ మ్యారేజ్‌ : వారి పెళ్లి వేద మంత్రాల సాక్షిగా కాదు రాజ్యాంగం సాక్షిగా అయ్యింది

భారతీయులు అంతా కూడా భారత రాజ్యాంగంను గౌరవించాలి.అన్ని మతాల వారికి అది పరమ పవిత్రమైనది.

 Unique Marriage In Madhya Pradesh Couple Ties Knot By Constitution Rules-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంను దైవంగా భావించాలి.కాని కొందరు మాత్రం అసలు రాజ్యాంగం అంటే ఏంటో కూడా బతికేస్తూ ఉన్నారు.

రాజ్యాంగం గురించి కనీస అవగాహణ లేని వారు చాలా మంది ఉన్నారు.చదువుకున్న వారికి కూడా రాజ్యాంగం గురించి అవగాహణ లేక పోవడం దురదృష్టకరం.

అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజ్యాంగం ఉంది.దేశం నడుస్తున్నది రాజ్యాంగం మీదే.

అయినా కూడా చాలా మంది రాజ్యాంగంను పట్టించుకోవడం లేదు.

Telugu Madhya Pradesh, Uniquemadhya-General-Telugu

రాజ్యాంగం గురించి పబ్లిసిటీ చేయడంతో పాటు నలుగురికి రాజ్యాంగం గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మద్య ప్రదేశ్‌ కు చెందిన ఒక జంట వినూత్న ప్రయోగం చేసింది.వారు తమ పెళ్లిని వేద మంత్రాలు.అయ్యవారి ఆశీస్సులతో కాకుండా రాజ్యాంగం సాక్షిగా చేసుకున్నారు.

వారి పెళ్లి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఫిబ్రవరి 16వ తారీకున జరిగిన ఈ వివాహ వేడుక జాతీయ మీడియాలో ప్రముఖంగా రావడంతో వారిని అంతా అభినందిస్తున్నారు.

Telugu Madhya Pradesh, Uniquemadhya-General-Telugu

పెళ్లి వేడుక సమయంలో రాజ్యాంగంను చదివి చెప్పడంతో పాటు రాజ్యాంగం ప్రాముఖ్యతను కూడా ఆ పెళ్లిలో వివరించారు.పెళ్లికి వచ్చిన వారికి రాజ్యాంగం గురించి వివరించడంతో వారు చాలా విషయాలు తెలుసుకున్నారు.రాజ్యాంగం గురించి నుగురికి తెలియాలని, అన్ని భాషల వారు కూడా రాజ్యాంగంను పవిత్రంగా భావించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఇలా పెళ్లిని రాజ్యాంగం సాక్షిగా చేసుకున్నామంటూ ఆ కొత్త జంట చెబుతున్నారు.

రాజ్యాంగం ప్రాముఖ్యత అందరికి తెలిస్తే చాలని, తమకు పబ్లిసిటీ అక్కర్లేదు అంటూ వారు వినమ్రంగా మాట్లాడుతున్న మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నిజంగా ఈ దంపతులు ఆదర్శవంతులు.వీరు చేసిన పని అందరికి ఆదర్శనీయం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube