రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి భార్య మృతి..!!  

కేంద్ర రక్షణ ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాదనాయక్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో కేంద్రమంత్రి బయటపడగా ఆయన భార్య విజయ అదేవిధంగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపం వద్ద జరిగింది.శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.

మంత్రి ఎల్లపూర్ నుండి గోకర్ల వెళుతుండగా ఈ ప్రమాదం జరగటంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గాయపడిన నాయక్ దంపతులను, పి ఎ దీపక్ ను సమీపంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు.ఆస్పత్రికి వెళ్లక ముందే కేంద్ర మంత్రి భార్య మరియు పిఎ ఇద్దరూ చనిపోవడం జరిగింది.దీంతో ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కు మెరుగైన వైద్యం కోసం గోవాలోని బంబోలి ఆసుపత్రి కి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ లు వెంటనే స్పందించి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఫోన్ చేసి శ్రీపాద నాయక్ కు  మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.కేంద్రమంత్రి పెద్దల ఆదేశాల తో వెంటనే గోవా సీఎం సావంత్ హాస్పిటల్ కి చేరుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

#Shripad Naik #Rajnath Sing #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Union Ministers Wife Killed In Road Accident Related Telugu News,Photos/Pics,Images..