'వాగ్ధాటికి' ఎదురుదెబ్బ??

ఈ రాజకీయ రణరంగంలో ఎవరు విజేతలో అనేది ప్రజలే నిర్ణయిస్తారు.అయితే అధికారం రాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.

 Venkaiah Naidu Says Sorry-TeluguStop.com

కొన్ని సార్లు బాగానే ఉన్నా…ఒక్కోసారి దెబ్బ తినక తప్పదు.దాదాపుగా 10ఏళ్ల పోరాటం తరువాత కమలం పార్టీకి అధికారం దక్కింది.

అయితే ఆ పార్టీలో సీనియర్ నేత అయినటువంటి వెంకయ్య నాయుడు ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదిలా ఉంటే ఎప్పుడూ తన వాగ్ధాటితో విరుచుకుపడే వెంకయ్యకు ఎదురుదెబ్బ తగిలింది.

వెటకారం పాళ్లు కాస్త ఎక్కువై.కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ వంటి పార్టీలనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి.

ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు.ఇంకెక్కడికో దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదని రాహుల్ ను ఉద్దేశించి సెటైర్ వేశారు.

అంతేకాదు.సీపీఐ ను కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అని.టీఆర్ ఎస్ ను వీఆర్ఎస్ అని.ఇలా ఒక పార్టీ అని కాకుండా అందర్నీ ఏకేశారు.వెంకయ్యతీరుతో చిన్నబుచ్చుకున్న విపక్షాలన్నీ ఏకమయ్యాయి.వెంకయ్యలాంటి సీనియర్ నేత అలా నోటికొచ్చినట్టు పార్లమెంటులో మాట్లాడటం సరికాదన్నాయి.వెంకయ్య సారీ చెప్పేదాకా సభ నడవనియ్యబోమని పట్టుబట్టాయి.రైల్వే బడ్జెట్ ను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

ఇక చేసేది ఏమీ లేక మోడి.వెంకయ్య, అరుణ్ జైట్లీతో మాట్లాడి.

వ్యవహారం ఏదోలా సెటిల్ చేయమని సూచించారు.దాంతో వెంకయ్యకు వివరణ ఇచ్చుకోకతప్పింది కాదు.

తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదనీ.ఎవర్నీ ఇబ్బంది కలిగించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.

మరి ఎంత అధికారం చేతిలో ఉన్నా.కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిది అని ఇప్పటికైనా వెంకయ్యకు అర్ధం అయ్యిందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube