సంప్ర‌దాయ నృత్యం చేసిన కేంద్ర‌మంత్రి.. ప్ర‌ధాని మోడీ స్పంద‌న‌..

మ‌న దేశంలో చాలా రాష్ట్రాల్లో సంప్ర‌దాయ పండుగ‌లు ఎంత వైభ‌వంగా నిర్వ‌హిస్తారో అంద‌రికీ తెలిసిందే.మ‌రీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఈ సాంప్రదాయ పండుగ‌లు చాలా వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.

 Union Minister Performs Traditional Dance Prime Minister Modi's Response , Kiran-TeluguStop.com

ఇక ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సంప్ర‌దాయ నృత్యాలు చాలా ఫేమ‌స్‌.ఇలాంటి ప్ర‌త్యేక‌త ఉన్న రాష్ట్రంలో కేంద్ర న్యాయశాఖ అయిన‌టువంటి కిరణ్ రిజిజ్ బుధవారం ఈ వేడుక‌లు సంద‌ర్భంగా పర్యటించారు.

కాగా ఆయ‌న ఇలా ప‌ర్య‌టిస్తున్న క్ర‌మంలో ఓ గ్రామానికి చేరుకున్నారు.ఆ గ్రామంలో చాలా సుంద‌ర‌మైన‌ది.

అయితే ఆ ఊరి పేరు క‌జ‌లాంగ్ అని తెలుస్తోంది.ఆయ‌న ఈ ఊరిలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి గ్రామ‌స్తుల‌తో క‌లిసి స‌ర‌దాగా మిజి నృత్యాన్ని చేశారు.ఇది అ్క‌డి ప్ర‌జ‌ల సంప్ర‌దాయ నృత్యం అని తెలుస్తోంది.ఇక్క‌డ నివ‌సించేట‌టువంటి సజోలాంగ్ ప్రజలు ఈ నృత్యాన్ని ఎంతో సంప్ర‌దాయంగా భావిస్తుంటారు.

ఇక త‌మ ఊరికి వ‌చ్చిన కేంద్ర‌మంత్రికి కూడా వారు ఈ విధంగానే స్వాగతం పలికారు.ఇక అక్క‌డున్న వారంతా కూడా చ‌ప్ప‌ట్ల‌తో అభిమానం తెలుప‌గా ఒక్కొక్కరిగా వచ్చి కేంద్ర‌మంత్రి ముందు సంప్రదాయ నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

సంప్ర‌దాయ నృత్యం చేసిన కేంద్ర‌మంత్రి.ప్ర‌ధాని మోడీ స్పంద‌న‌.

అయితే అంద‌రితో పాటు కేంద్రమంత్రి కూడా సంప్ర‌దాయ నృత్యం చేసి అల‌రించారు.ఇక అక్క‌డున్న వారు ఆ నృత్యాన్ని వీడియో తీయ‌గా ఆయ‌న దాన్ని ట్వీటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

ఇక ఇలా పోస్టు చేసిన కొద్ది సేప‌టికే అది కాస్తా వైర‌ల్ గా మారిపోయింది.అయితే ఇది కాస్తా ప్రధాని నరేంద్ర మోదీ వ‌ద్ద‌కు చేరింది.

ఆయ‌న దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.కిరణ్‌ రిజిజ్ మంచి డ్యాన్సర్ అంటూ మెచ్చుకున్నారు.

ఈ విధంగా అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంప్ర‌దాయ నృత్యాన్ని చూడ‌టం ఎంతో ఆనందంగా ఉంద‌ని వివ‌రించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube