కెన్యా అధ్యక్షుడిగా విలియమ్ రూటో : ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా కేంద్ర మంత్రి మురళీధరన్

కెన్యా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ విలియమ్ రూటో ఎన్నికైన సంగతి తెలిసిందే.ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.

 Union Minister Muraleedharan To Attend Swearing-in Of Kenyan Prez Dr William Rut-TeluguStop.com

ఈ కార్యక్రమానికి అతిథిగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ హాజరయ్యారు.ఢిల్లీ నుంచి కెన్యా రాజధాని నైరోబీ చేరుకున్న ఆయనకు అక్కడి భారతీయ దౌత్యవేత్తలు , అధికారులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రూటోకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెబుతూ ఇచ్చిన లేఖను మురళీధరన్ అందజేశారు.

అంతకుముంతు నైరోబీలో దిగిన వెంటనే మురళీధరన్ ఇలా ట్వీట్ చేశారు.‘‘‘ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ విలియం రూటో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కెన్యాలోని నైరోబీకి వచ్చినందుకు సంతోషంగా వుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అభినందనల సందేశాన్ని రూటోకి అందజేస్తాను.ఇక్కడి భారతీయ కమ్యూనిటీని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.కెన్యా ప్రధాని రైలా అమోలో ఒడింగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.ఇరువురు నేతలు దశాబ్ధాల నాటి స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాలను పంచుకున్నారు.దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఒడింగాను కలవడం పట్ల ప్రధాని మోడీ సైతం హర్షం వ్యక్తం చేశారు.2009, 2012లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌కు ఒడింగా మద్ధతిచ్చారు.కెన్యాలో పెద్ద సంఖ్యలో భారతీయ కమ్యూనిటీ నివసిస్తోంది.

వీరిలో ఎక్కువ మంది ఉగాండా రైల్వే స్టేషన్, రైల్వే లైనును నిర్మించడానికి వలస వచ్చిన వారే.

Telugu Dr William Ruto, Gujarat, Kenya, Muraleedharan, Primenarendra, Muralidhar

కెన్యా, భారత్‌లు ఐక్యరాజ్యసమితి, అలీనోద్యమం, కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్, జీ 77, జీ 15, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వంటి అంతర్జాతీయ వేదికలలో సభ్య దేశాలు.ఇరు దేశాల మధ్య దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి.కెన్యా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (కెన్ ఇన్వెస్ట్) ప్రకారం.కెన్యాలో భారత్ రెండవ అతిపెద్ద పెట్టుబడిదారు.వాణిజ్యం, రాజకీయాలతో పాటు ఇరుదేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు వున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube