కేంద్ర మంత్రి షెకావత్ కు కరోనా పాజిటివ్!

మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.ఇప్పటికే కేంద్ర మంత్రులు పలువురు కరోనా బారిన పడగా తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

 Union Minister Gajendra Singh Shekhawat Tested Corona Positive,  Gajendra Sing S-TeluguStop.com

కొద్దిగా ఆయాసం రావడం తో కరోనా పరీక్షలు చేయించుకోగా ఈ విషయం వెల్లడైంది అంటూ ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.ప్రస్తుతం ఆసుపత్రికి వెళుతున్నాను అని అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందనున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే కొద్దీ రోజుల నుంచి ఆయనను కలిసిన వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని,వీలయితే ఐసోలేషన్ లో ఉండాలి అంటూ ఆయన సూచించారు.

అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి పాజిటివ్ రావడం తో అపెక్స్ కమిటీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

షెకావత్ అధ్యక్షతన ఈ నెల 25 న ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కార నిమిత్తం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది.అయితే షెకావత్ కు పాజిటివ్ రావడం తో ఈ సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే వాస్తవానికి ఆగస్టు 5 నే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించగా,అయితే, అదే రోజు తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం తో ఈ సమావేశం ను ఈ నెల 25 కు వాయిదా వేశారు.

ఇప్పుడు మళ్లీ షెకావత్ కు కరోనా పాజిటివ్ రావడం తో ఈ సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మరో తేదీని ఫిక్స్ చేసే అవకాశం ఉంది.ఇప్పటికే కేంద్ర హోంమంత్రి తో సహా పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన విషయం విదితమే.

ఇలా వరుసగా ప్రజా ప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.ఇటీవల రాజస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం లో షెకావత్ కాంగ్రెస్ నేతలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube