మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మన దేశం మన మందులు..?

మొన్నటికి మొన్న చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెక్ పెట్టేందుకు భారత శరవేగంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ భారత దేశ వ్యాప్తంగా చైనాకు ఉన్న అన్ని కాంట్రాక్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.

 Union Government Boostup Decision For Bulk Drug Industry, Drug Industry, Union G-TeluguStop.com

ఇక అంతేకాకుండా చైనా కు సంబంధించిన 59 యాప్స్ ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.ఇక ప్రస్తుతం మరో ప్లాన్ కి కూడా సిద్ధమైంది.

ఈ క్రమంలోనే చైనా పై ఆధార పడకుండా మన దేశంలోనే పూర్తిస్థాయి డ్రగ్స్ తయారుచేసేలా ఫార్మా కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చైనా నుంచి ముడి సరుకులను భారత్ దిగుమతి చేసుకుంటుంది.

ఇక చైనా నుంచి దిగుమతి ఆపేసి ఫార్మా కంపెనీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల ముడిసరుకులను భారతదేశంలోని ఫార్మా కంపెనీలలో తయారు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపి బల్క్ డ్రగ్ పార్కులను నిర్మించాలని.

ఈ ఏడాదిలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయించబోతున్నట్లు సమాచారం.వీటిలో అన్ని రకాల ముడి సరుకులకు సంబంధించి డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే డ్రగ్ పార్కు నిర్మాణానికి కేంద్రం రాష్ట్రానికి వెయ్యి కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు డ్రగ్ లకు చెక్ పెట్టే అవకాశం తొందరలోనే ఉన్నది అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube