కరోనా బారిన పడ్డ కేంద్ర ఆయూష్ మంత్రి శ్రీపాద్ వై నాయక్..!

ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడగా.తాజాగా కేంద్ర ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్‎కు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది.

 Union Ayush Minister, Shripad Y Nayak, Corona Positive, Central Ministers, Coron-TeluguStop.com

ఎలాంటి లక్షణాలు లేకున్నా బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‎గా రిపోర్టు వచ్చినట్టు ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.తనకు ఎలాంటి కరోనా లక్షణాలు గానీ, అనారోగ్య సమస్యలు గానీ లేవని స్పష్టం చేశారు.

కరోనా పాజిటివ్ రావడంతో తాను హోం ఐసోలేషన్‎లో ఉన్నానంటూ ట్వీట్టర్‎లో పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీపాద్ వై నాయక్ సూచించారు.కాగా, ఇప్పటివరకు హోం మంత్రి అమిత్ షాతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube