తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం సమావేశమైంది.ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.
సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్‌లతో కూడిన బృందం సమావేశం అయ్యారు.
ఇక ఇదే భేటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ ఫోను మాల కొండయ్య ఇంకా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వీసి అండ్ ఎండి జి శేఖర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కేంద్ర వ్యవసాయ శాఖ బృందం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు గంటకు పైగానే ఈ సమావేశం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.