పంపు హౌస్ లో గుర్తుతెలియని శవం.. తెలిసిన వారు ఇలా చేయండి.. !

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం లోని కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్ లో గుర్తుతెలియని శవం లభ్యం అయినట్లు కాళేశ్వరం ఎస్ఐ నరహరి తెలిపారు.ఈ రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్ వద్ద శవం ఉన్నట్లు పంపుహౌస్ లో పని చేసే కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్దలానికి వెళ్లిన పోలీసులు అక్కడే ఉన్న గంగపుత్రల సాయంతో శవాన్ని బయటకు తీసి పరిశీలించారు.

 Unidentified Body Found In Pump House-TeluguStop.com

ఈ శవం ప్రాణహిత గోదావరి నుండి కొట్టుకొని వచ్చినట్టు ఎస్ఐ నరహరి గుర్తించారట.కాగా ఈ మృతుని వయస్సు సుమారుగా 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, చాక్లెట్ కలర్ చొక్కా కాకి కలర్ పాయింట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 Unidentified Body Found In Pump House-పంపు హౌస్ లో గుర్తుతెలియని శవం.. తెలిసిన వారు ఇలా చేయండి.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ మృతదేహన్ని మహదేవపూర్ ఆసుపత్రికి తరలిస్తునట్లు తెలుపుచున్న పోలీసులు, మృతుని వివరాలు ఎవరికైనా తెలిసినచో కాళేశ్వరం ఎస్ఐ గారిని 7901097045, 994994822 నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు.

#Kannepalli #Kaleshwaram #UnknownDead #Dead Body #Pump House

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు