మరపురాని 2020: ఇండో- యూఎస్ సంబంధాలలో ఓ మైలురాయి

కరోనా మహమ్మారి దేశీయంగా, అంతర్జాతీయంగా రాజకీయ ప్రతిష్టంభన ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇండో- అమెరికా సంబంధాలను బలోపేతం చేసినట్లు చెప్పుకోవచ్చు.2020 ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదం చేసింది.

 Unforgettable 2020: A Milestone In India-us Ties,  India-us Ties, India And Us R-TeluguStop.com

నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇరు దేశాలు 2+2 ఫ్రేమ్ వర్క్‌ను కలిగివున్నాయి.ఇది ద్వైపాక్షిక సంబంధాల పరిపక్వతను ప్రతిబింబిస్తోంది.అమెరికాతో 2+2 చర్చలు జరిపిన రెండో దేశం భారతదేశం మాత్రమే.అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరిలో జరిపిన భారతదేశ పర్యటన ఇరు దేశాల మధ్య అనుబంధంలో విశేషమైన వృద్దిని తెచ్చింది.

ఈ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి ట్రంప్- మోడీలు తీసుకున్న నిర్ణయాలు మరింత సాయపడ్డాయని అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

Telugu Covid Time, Donald Trump, Gegeo Spatial, India, Pm Modi-Telugu NRI

మా ప్రజాస్వామ్య పునాదులు, కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను పునర్నిర్మించడంలో పరస్పర ఆసక్తి, గ్లోబల్ సప్లయ్ చైన్‌లను వైవిధ్య పరచడంతో పాటు ఇండో – పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరిగేలా ఇండో- యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అమెరికా కట్టుబడి వుందన్నారు.

భారత్, అమెరికాలు జియో- స్పేషియల్ కో ఆపరేషన్ (బీకా) కోసం బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ ఒప్పందంపై సంతకం చేశాయి.దీంతో ఇరు దేశాలు రక్షణ సంబంధాలను పెంపొందించడానికి పునాదిరాళ్ల వంటి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

ఇదే సమయంలో ఇండియన్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డీఓఓ- ఐడెక్స్), యూఎస్ డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్ మధ్య జూలైలో ఓ సమావేశం జరిగింది.కోవిడ్ విపత్కర కాలంలో భారత్- యూఎస్ సంబంధం మరింత పెనవేసుకుందన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు.

ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 2020లో రెండు దేశాలు కలిసి పనిచేశాయని ఆయన గుర్తుచేశారు.

Telugu Covid Time, Donald Trump, Gegeo Spatial, India, Pm Modi-Telugu NRI

ప్రధాని మోడీ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం ద్వారా అమెరికా కార్పోరేట్ రంగంతో వర్చువల్ మీటింగ్‌లు జరిపారు.భారత్- యూఎస్ సీఈవో ఫోరం కూడా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాన్ని పెంచే లక్ష్యంతో తన సమావేశాలను నిర్వహించింది.

ఇక కోవిడ్ విషయానికి వస్తే వైరస్‌ను నియంత్రించేందుకు అమెరికా, భారత్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయి.

క్లిష్టమైన ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ఇరు దేశాలకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.అలాగే కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిపైనా కలిసి పనిచేస్తున్నాయి.ఇక 1970ల నుంచి డెమొక్రాటిక్ సెనేటర్‌గా ఉన్నప్పటి నుంచి భారత్- అమెరికా సంబంధాలపై పూర్తి అవగాహన వున్న జో బైడెన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ ఏడాది జరిగిన అతిపెద్ద విశేషం.2021లో యూఎస్- ఇండియా లావాదేవీలు ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube