క్రికెట్ అంటేనే యూత్‌కు ఎక్కడ లేని ఎంజాయ్ మెంట్ వచ్చేస్తుంది.క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా సరే వెంటనే పాపులర్ అయిపోతుంది.
ఇకపోతే క్రికెటర్లు ఎలాంటి రికార్డులు సృష్టించినా సరే ఫ్యాన్స్ వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుంటారు.అయితే మైదానంలో కొన్ని సార్లు అనుకోని అనూహ్య ఘటనలు కూడా జరుగుతుంటాయి.
అయితే అనూహ్యంగా ఔట్ అయిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఎంతలా పాపులర్ అవుతుంటాయో మనందరికీ తెలిసిందే.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి బాగా పాపులర్ అవుతోంది.
బంగ్లాదేశ్ లో ఇప్పుడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది.ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న రెండవ మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్‌లో చరిత్రలో ఇప్పటి వరకు జరగని విధంగా రనౌట్ జరిగింది.ఈ చారిత్రాత్మక మ్యాచ్ మినిస్టర్ గ్రూప్ ఢాకాకు అలాగే ఖుల్నా టైగర్స్ నడుమ నిర్వహించారు.
అయితే మెహముదుల్లా నాయకుడిగా ఉన్న టీమ్ మినిస్టర్ గ్రూప్ ఢాకా టీమ్ లో వెస్ట్ ఇండీస్ స్టార్ క్రికెటర్ రస్సెల్ ఆడుతున్నాడు.అయితే మ్యాచ్‌లో భాగంగా అతను బ్యాటింగ్‌కు దిగాడు.
కాగా అతని అభిమానులు కూడా బాగానే వచ్చారు చూడటానికి.
అయితే బ్యాటింగ్‌కు దిగిన రస్సెల్‌కు తిసార పెరీరా బౌలింగ్ వేశాడు.ఇక ఓవర్ చివరి బాల్‌ను థర్డ్‌మ్యాన్ వైపు వైపుగా బాదాడు.ఇక బాల్ ను చూస్తూ వెనక్కు తిరిగి పరుగులు తీస్తున్నాడు రస్సెల్.అయితే థర్డ్‌మ్యాన్ లో ఫీల్డర్ గా ఉన్న క్రికెటర్ ఎండ్‌లో ఉన్న స్టంప్‌లకు తాకే విధంగా బాల్‌ను విసిరాడు.
కీపర్ సైడ్ ఉన్న స్టంప్స్‌కు తాకుతుందని రస్సెల్ అనుకున్నాడు.కానీ అది అనూహ్యంగా రస్సెల్ ఔట్ అయ్యేలా చేసింది.దీంతో అంతా షాక్ అయిపోయారు.ఇలా విచిత్రంగా ఔట్ కావడం ఏంటని చాలామంది దీన్ని ఇంకా నమ్మట్లేదు.