ఫేస్బుక్ కి అనుకోని షాక్.. ఆ ఫీచర్ ను కాపీ చేశారంటూ..?!

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్బుక్ తరచూ ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉందని చెప్పాలి.నిన్నటి దాక ఫేస్ బుక్ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసిందనే ఆరోపణలు ఎదుర్కుంటూ వస్తుంది.

 Unexpected Shock To Facebook Copied That Feature Facebook, Senstional Comments,-TeluguStop.com

ఆ గొడవ ఇంకా సర్దుమణక ముందే మళ్ళీ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ ఫోటో యాప్ అయిన ఫోటో అనే సంస్థ తమ ఫోటో ఫీచర్ లను పోలిన ఫీచర్స్ ను కాపీ కొట్టాయని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లపై ఆరోపించింది.

తమకు మాత్రమే చెందిన ఈ ఫీచర్ ను ఈ యాప్ లు క్లోన్ చేశాయని విమర్శించింది. దీనికి గానూ మాతృసంస్థ అయిన మెటా తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది.

 దీంతో ఆ సంస్థ అధినేత అయిన మార్క్ జూకర్ బర్గ్ కు నోటీసులు పంపించింది.

తాజాగా ఫేస్బుక్ లో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ యూజర్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

అది ఏమిటంటే.ఒకే ఫ్రేమ్ లో వివిధ రకాల స్టిల్స్ తో ఐదు ఫోటోలను తీసుకోవచ్చు.

ఇలా ఫోటోలు తీసుకున్న తరువాత అది ఆటోమేటిక్ గా 20 నుంచి 30 సెకన్లకు మధ్యన ఉండే చిన్న వీడియోలాగా కన్వెర్ట్ అవుతుంది.దీనిని పోస్ట్ చేయగానే ఇన్స్టాగ్రామ్ లోని మన వాల్ లో కనిపిస్తుంది.

ఈ వీడియో మేకింగ్ కు డేటా కూడా తక్కువే అవ్వడంతో చాలామంది వినియోగదారులు దీనిని ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఫోటో అనే సంస్థ ఫేస్బుక్ లో వచ్చే ఈ ఫీచర్ పైనే ఆరోపణలు చేసింది.

Telugu Copy, Senstional-Latest News - Telugu

వరుసగా ఇలా ఒకే ఫ్రేమ్ లో ఐదు పిక్ లు రావడం అనేది మా ఫోటోకి చెందిన ఫీచర్ అని, దానిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లు కాపీ కొట్టాయని ఆరోపించింది.ఇలా మా ఫీచర్ ను కాపీ కొట్టడం వలన తాము భారీగా నష్టపోయామని ఫోటో సంస్థ తెలిపింది.కాగా ఈ ఫోటో యాప్ అనేది ప్రస్తుతం ట్రేండింగ్ లో లేదు.దీనిని 2014లో ప్రారంభించగా ప్రజాదారణ తక్కువగా ఉండడంతో మూడేళ్లలోనే దీనిని ఆపేసారు.ఇప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ ను ఫేస్ బుక్ తిరిగి క్లోన్ చేసుకుందని ఫోటో సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు.మరి ఈ విషయంపై ఫేస్బుక్ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube