వైజాగ్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకి ఊహించని షాక్..!!

మున్సిపాలిటీ ఎన్నికలలో సత్తా చాటాలని ఏపీలో ప్రధాన పార్టీలు భారీ స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాయి.ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ తగ్గటం లేదు.

 Unexpected Shock To Chandrababu In Vizag Election Campaign-TeluguStop.com

పంచాయతీ ఎన్నికలలో పెద్దగా స్థానాలు గెలవలేని పరిస్థితి ఉండటంతో.పార్టీ గుర్తు పై మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఊరూరా తిరుగుతున్నారు.

ఈ క్రమంలో రాయలసీమ జిల్లాలో కర్నూల్ లో పర్యటించిన చంద్రబాబు కి అక్కడి న్యాయవాదులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Unexpected Shock To Chandrababu In Vizag Election Campaign-వైజాగ్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకి ఊహించని షాక్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హైకోర్టు విషయంలో కర్నూలు కి చెందిన న్యాయవాదులు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎదుట నిరసన తెలిపారు.

ఇప్పుడు ఇదే రీతిలో వైజాగ్ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చారు వైజాగ్ నిరసనకారులు.మేటర్ లోకి వెళ్తే విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు ని ఉత్తరాంధ్ర ద్రోహి గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.

చాలా వరకు రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో తలనొప్పిగా మారినట్లు తాజా పరిస్థితులు బట్టి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఏది ఏమైనా జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై ప్రస్తుతం అంతట సర్వత్రా ఆసక్తి నెలకొంది.

#Chandrababu #Vizag #Karnool

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు