బైక్ ఎత్తుకెళ్తున్న దొంగ‌ల‌కు ఊహించని షాక్‌..

Unexpected Shock To Bike Hijackers

కాలం ఎంత‌లా అభివృద్ధి చెందుతున్నా స‌రే దొంగ‌లు మాత్రం త‌మ బుద్ధిని మార్చుకోకుండా ఇంకా అడ్వాన్స్‌ టెక్నాల‌జీతో దొంగ‌త‌నాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు.పైగా పెరుగుత‌న్న టెక్నాల‌జీని కూడా ఇందుకోసం వారు వాడేయ‌డం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

 Unexpected Shock To Bike Hijackers-TeluguStop.com

ఎలా అయితే దొరక్కుండా ఉంటామో అని ప్లాన్లు వేసుకుని మ‌రీ దోచేయ‌డానికి రెడీ అయిపోతున్నారు.ఇంకో విష‌యం ఏంటంటే అత్యంత తెలివైన వారు కూడా ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఈజీ మ‌నీ కోసం వెంప‌ర్లాడి చివ‌ర‌కు ఊచ‌లు లెక్కిస్తున్నారు.

 Unexpected Shock To Bike Hijackers-బైక్ ఎత్తుకెళ్తున్న దొంగ‌ల‌కు ఊహించని షాక్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే దొంగ‌త‌నం అంటే అంత ఈజీనా అంటే కానేకాదు.

దానికి చాలా దైర్యం చేయాల్సి ఉంటుంది.ఏ మాత్రం బెడిసి కొట్టినా జైలు ఊచ‌లు లెక్కించాల్సిందే.

ఒక‌వేళ స‌క్సెస్ అయినా ఎన్నో తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది.ఇలా దొంగ‌త‌నానికి వ‌చ్చి దొరికిపోతున్న వారి ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.

కొంద‌రు అయితే చిన్న చిన్న పొర‌పాట్ల‌తోనే దొరికిపోతున్నారు.ఇప్పుడు కూడా ఓ ఇద్ద‌రు దొంగ‌లు ఏదో చేయ‌బోతే ఇంకేదో జ‌రిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఓ లండ‌న్ దేశంలోని మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రాఫోర్ట్ ప్రాంతంలో ఓ ఇద్ద‌రు దొంగ‌త‌నానికి వ‌చ్చారు.

అయితే వీరు ఇలా వ‌స్తూనే ఓ బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.ఇక బైక్ ను ఫాస్ట్ గా అక్క‌డి నుంచి తీసుకెళ్తుండగా అనుకోకుండా రోడ్డు మీద వారు స్పీడు పెంచేశారు.ఇంకేముంది ఎదురుగా అదే రోడ్డు మీద ఆగివున్న కారును ఢీకొట్టేశారు.ఇక ఆ దెబ్బ‌కు వారిద్ద‌రికీ తీవ్ర గాయాలు అయ్యాయి.ఇక్క‌డ ఓ ట్విస్టు ఏంటంటే ఇద్ద‌రిలో ఓ వ్య‌క్తి మాత్రం అక్క‌డే ప‌డిపోయి ఉండ‌గా.గాయాలు అయినా స‌రే మ‌రో వ్య‌క్తి మాత్రం ఆ బైక్‌ను ఎత్తుకెళ్లిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

#Bike Hijackers #Theft Bike #Car #Australia #England

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube