ఇంటి ముందు ఊహించ‌ని షాక్.. ఏం వ‌చ్చిందో చూస్తే..

పాములు ఇంటి ముందుకు రావ‌డం చాలా స‌ర్వ సాధార‌ణం.ఇక వ‌ర్షాకాలంలో అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

 Unexpected Shock In Front Of The House If You Look At What Happened, Python, Vir-TeluguStop.com

ఏ మాత్రం సందు దొరికినా ఇండ్ల‌లోకి దూరిపోతుంటాయి.ఇలాంటి స‌మ‌యంలో వాటిని నిర్ల‌క్ష్యం చేస్తే చివ‌ర‌కు ప్రాణాల మీద‌కే వ‌స్తుంది.

అందుకే వీటి ప‌ట్ల‌ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి.లేదంటే మ‌న ప్రాణాల‌ను మ‌న‌మే ప్ర‌మాదంలో ప‌డేసుకున్న వారం అవుతాం.

ఇక ఇలాంటి పాముల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉంటాయి.ఇప్పుడు కూడా ఓ వీడియో ఇలాగే ట్రెండ్ అవుతోంది.

గ్రామాల్లోకి విష‌స‌ర్పాలు రావ‌డం చాలా కామ‌న్ క‌దా.కానీ ఇప్పుడు మ‌నం చూడ‌బోయే వీడియోలో ఏకంగా ఓ కొండ చిలువ ఇంట్లో ప్ర‌వేశించేందుకు ఇంటిముదుకు వ‌చ్చేసింది.దాన్ని చూసిన కుటుంబీకులు షాక్ అయిపోయి వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన‌టువంటి నడికూడ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఓ భారీ కొండ చిలువ ఇలా జ‌నాల ఇండ్ల‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ‌చ్చి హ‌డ‌లెత్తించింది.ఈ మండలంలోని పులిగిల్లలో రాత్రి పూట స‌డెన్‌గా ఓ భారీ కొండచిలువ వ‌చ్చింది.

ఇంటి ముందుకు వ‌చ్చిన ఆ కొండ చిలువ ఇంట్లోకి ప్రవేశించేందుకు బాగానే ట్రై చేసింది.కానీ అదృష్టవశాత్తు తలుపులు క్లోస్ చేసి ఉండటం వ‌ల్ల అది లోప‌ల‌కు వెళ్ల‌లేక‌పోయింది.ఆ లోపే ఆ ఇంట్లో ఉన్న వారు దాన్ని చూసి వెంట‌నే అప్రమత్తమయ్యారు.బ‌య‌ట‌కు పరుగులు తీసి చుట్టుప‌క్క‌ల వారిని పిలిచారు.ఇక వారంగా వ‌చ్చి భారీగా గుమిగూడారు.ఇక దాన్ని బంధించి అటవీ శాఖ అధికారులకు స‌మాచారం ఇవ్వగా వారు వ‌చ్చి దాన్ని ప‌ట్టుకెల్లారు.

కాగా ఈ పాముకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube