అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

 Unexpected Response To Akhil Akkinenis Most Eligible Bachelor Lyric Song Leharai-TeluguStop.com

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది.‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్.తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది.అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది.

 Unexpected Response To Akhil Akkinenis Most Eligible Bachelor Lyric Song Leharai-అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది.ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్.ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

ఈ పాట లిరిక్స్.

Telugu Aditya Music, Akhil Akkineni, Leharai, Most Eligible Bachelor, Pooja Hegde, Sid Shriram, Unexpected Response To Akhil Akkineni\\'s \\'most Eligible Bachelor\\' Lyric Song \\'leharai\\'-Movie

లెహరాయి.లెహరాయీ.ఏ లేలేలే.

లేలేలేలే.లెహరాయీ లెహరాయీ.

గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి.లెహరాయీ లెహరాయీ.

గోరు వెచ్చనైన ఊసులదిరాయి.ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి.

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి.సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ.

లెహరాయీ లెహరాయీ.గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి.

లెహరాయీ లెహరాయీ.గోరు వెచ్చనైన ఊసులదిరాయి.

రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే.రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే.

వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే.మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ.

లెహరాయీ లెహరాయీ.గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి.

లెహరాయీ లెహరాయీ.గోరు వెచ్చనైన ఊసులదిరాయి.

వేలా పాలలనే మరిచే సరసాలే.తేదీ వారాలే చెరిపే చెరసాలే.

చనువు కొంచెం పెంచుకుంటూ.తనువు బరువే పంచుకుంటూ.

మనలోకం మైకం ఏకం అవుతూ.ఏకాంతాలే లెహరాయీ.

లెహరాయీ లెహరాయీ.గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి.

లెహరాయీ లెహరాయీ.గోరు వెచ్చనైన ఊసులదిరాయి.

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి.కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి.

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ.

#Sid Shriram #ResponseAkhil #Aditya Music #Pooja Hegde #Leharai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు