హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా .ఈ చిత్రానికి సంభందించిన టీజర్ ని ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ చేతుల మీదుగా విడుదల చేశారు
ఈ సందర్బంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.
ఈ టీజర్ ని చూసాను, వెంకట్ చాలా బాగా తీసారు.యూత్ కి ఏమి కావాలో అన్ని అంశాలు ఈ చిత్రం లో వుంటాయానేది తెలుస్తుంది.
హీరో తేజ, అఖిల చాలా బాగా నటించారు.ఈ చిత్రం ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వరావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేఖమైన శుభాకాంక్షలు.
ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కొరుకుంటున్నాను.అని అన్నారు
దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.
పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము.ఈ చిత్రం లో యూత్ కి ఏమి కావాలో అన్ని వుంటాయి.
చక్కటి ప్రేమకథ కూడా ఈ చిత్రం లో చూపించాము.ప్రేమ కథ తో వినొదాన్ని మిక్స్ చేసి ఈ కథని తెరక్కించాము.
ఇది మ్యూజికల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సాధిస్తుంది.ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేసాము.
అన్ని వర్గాల ప్రేక్షకుల్నిఆకట్టకుంటుంది.అని అన్నారు.
నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.
.తేజ్ కూరపాటి, ఆఖిల ఆకర్షణ ఎంత బాగా నటించారో ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది.ఈ జంట అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
మా చిత్రం టీజర్ ని ప్రముఖ గేయరచయిత అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా విడుదల చేశాము.ఆయనకి మా చిత్ర యూనిట్ తరుపున ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుతున్నాము.
అని అన్నారు
.