చిరంజీవి, నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు.ఎన్నో చక్కటి సినిమాల్లో నటించారు.
అద్భుత సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.అయితే నిజ జీవితంలో వీరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది.
ముఖ్యంగా నాగార్జున, చిరంజీవి చాలా ఆప్యాయంగా ఉంటారు.ఇద్దరు కలిసి పలు వేడుకల్లోనూ పాల్గొంటారు.
ఇద్దరూ ఎంతో ఉల్లాసంగా గడుపుతూ చూపరులకు సంతోషాన్ని కలిగిస్తారు.
తాజాగా ఒకే రోజు నాగార్జున కుటుంబానికి చెందిన రెండు కార్యక్రమాల్లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు.
ఇది కావాలనే చేశారా? అనుకోకుండా అలా జరిగిందా? అనేది తెలియదు కానీ.ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు.
దాని పేరు లవ్ స్టోరీ.ఆదివారం నాడు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.ఈ కార్యక్రమలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నాడు.దీనికి ఒక్కరోజు ముందు నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ సీజన్-5 లో రాంచరణ్ పాల్గొన్నాడు.డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.నాగ్ నిర్వహించే ఈ కార్యక్రమానికి చెర్రీ రావడంతో షోపై జనాల్లో ఆసక్తి పెరిగింది.
లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుక కూడా నాగార్జున కొడుకు చైతన్యకు సంబంధించి పెద్ద ప్రోగ్రాం.దీనికి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఆసక్తి కలిగిస్తుంది.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నాగార్జున రాకపోవడం విశేషం.అయితే ఎందుకు తను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అనే విషయం బయటకు మాత్రం తెలియదు.అయితే ఒక్క రోజు వ్యవధిలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన రెండు మెగా ఈవెంట్లకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇది కావాలనే చేశారా? లేదా అనుకోకుండా జరిగాయా? అనేది చర్చనీయాంశం అయ్యింది.