సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం  

Unexpected Habits That Damage Your Kidneys-kidneys,telugu Health Tips,unknown Habits Of Kidney

Kidneys do not degrade. If they want to be damaged, they have a habit of harming them. Habit and addiction .. We hear these words first we recall cigarettes or alcohol. These are the habits that harm the kidneys. But that's not the only reason. That is why smoking and drinking habits also have problems in kidneys. Because the kidneys are still habits. These habits may not seem to be extremely dangerous to us, but they can do harm to the silent. See Awna.

Something is at work. Meanwhile urine appears to be coming. Then most of the urine does not extinguish it, and it is put on hold. Appear until it is difficult to cope with, then extinguish. This is a bad habit. This can lead to impurities, kidney stones can occur.

-> ..

To be honest, the kidneys depend on the water we drink and other liquids. Toxins do not go out unless we drink well water. Unless the toxins are exposed, the kidneys are not clean. Some of the drinking water is bad. It is also a bad hobbit. This habit will cause many problems for your kidneys. At home cooked curry is the same. But what if there is only one in the house that is low in salt? Some people have this habit. Salt is well eaten. This leads to sodium in the body. The sodium went mostly into the kidneys, which means that the kidneys are in danger. That is why salt must be taken as limits. While the curry is low in size, salt can not be eaten more. If the doctor has a drug, it should be used as well as how it is used. Use of tablates is not good for your kidneys. Tablets like ibuprofen, aspirin, and even some antibiotics take over your kidneys.

కిడ్నీలు ఒక్కసారిగా చెడిపోవు. అవి చెడిపోవాలంటే, వాటికి హాని చేసే అలవాటు ఉండాల్సిందే. అలవాటు, వ్యసనం ..

సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం-Unexpected Habits That Damage Your Kidneys

ఈ పదాలు వింటే మనకి మొదట సిగరేట్ లేదా మద్యం గుర్తుకువస్తాయి. కిడ్నీలకు హాని చేసే అలవాట్లే ఇవి.

కాని ఇవి మాత్రమే కారణం కావు. అందుకే ధూమపానం, మద్యపానం అలవాట్లు లేనివారికి కూడా కిడ్నీల్లో సమస్యలు వస్తాయి. ఎందుకంటే, కిడ్నిలను పాడు చేసే అలవాట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి.

ఈ అలవాట్లు మనకి అంతగా ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు కాని, ఇవి సైలెంట్ గా చేయాల్సిన హాని చేసేస్తాయి. మరి అవేంటో చూడండి.ఏదో పనిలో ఉన్నారు.

ఇంతలో మూత్రం వస్తున్నట్లు అనిపించింది. అప్పుడు చాలామంది మూత్ర విసర్జన చేయకుండా, దాన్ని ఆపి ఉంచుతారు. ఇక తట్టుకోవడం కష్టం అని అనిపించేదాకా అపి, అప్పుడు విసర్జన చేస్తారు.

ఇది చాలా చెడ్డ అలవాటు. దీన్ని వలన మలినాలు వెనక్కిపోవచ్చు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవచ్చు.పచ్చిగా చెప్పాలంటే, కిడ్నీలు మనం తాగే నీటిమీద, ఇతర ద్రవపదార్థాల మీద ఆధారపడి ఉంటాయి.

మనం నీళ్ళు బాగా తాగితే తప్ప టాక్సిన్స్ బయటకిపోవు. టాక్సిన్స్ బయటకిపోతే తప్ప, కిడ్నిలు శుభ్రంగా ఉండవు. కొందరు మంచినీళ్ళు సరిగా తాగరు.

ఇది కూడా ఒక బ్యాడ్ హాబిట్. మీ కిడ్నీలను అనేక సమస్యలకు గురిచేస్తుంది ఈ అలవాటు.ఇంట్లో వండిన కూర ఒకటే.

కాని ఇంట్లో ఒకరికి మాత్రమే అందులో ఉప్పు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే? కొందరికి ఈ అలవాటు ఉంటుంది. ఉప్పు బాగా తింటారు. దీంతో శరీరంలోకి సోడియం బాగా చేరుతుంది.

సోడియం ఒంట్లోకి ఎక్కువగా వెళ్ళింది అంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే ఉప్పు లిమిట్ గా తీసుకోవాలి. కూరలో తక్కువ వేసుకున్నంత మాత్రానా సరిపోదు, ఉప్పు ఉన్న పిండివంటకాలు ఎక్కువ తినకూడదు.

డాక్టర్ ఒక మందు రాస్తే, దాన్ని ఎప్పటిదాకా, ఎలా వాడమన్నాడో, అలానే వాడాలి. టాబ్లేట్స్ ఇష్టంవచ్చినట్లు వాడటం మీ కిడ్నీలకు మంచిది కాదు. ఇబుప్రొఫెన్, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్, ఇంకా కొన్నిరకాల యాంటిబయోటిక్స్ అతిగా తీసుకుంటే మీ కిడ్నీలను మీరే నాశనం చేసుకుంటున్నట్లు.

డయాబెటిస్ వచ్చేంతగా స్వీట్స్ తినడం, వ్యాయామం తప్పడం లేక చేసే అలవాటు లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ ని కంట్లోల్ లో ఉంచుకోకపోవడం, చివరకి టమోటాలు, ఆరెంజ్, ఆలు గడ్డ, మాంసం కూడా టూ మచ్ గా తినటం కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మంచి అలవాట్లు కావు.