తల్లి నుంచి ఖరీదైన గిఫ్ట్ ని సర్ప్రైజ్ గా అందుకున్న స్టార్ హీరో

కోలీవుడ్ లో లవర్ బాయ్ గా పరిచయం అయ్యి తరువాత కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శింబు.ఈ హీరో తన సినిమాల ద్వారా కంటే హీరోయిన్లుతో నడిపించిన ప్రేమ వ్యవహారాలతోనే బాగా పాపులర్ అయ్యాడు.

 Unexpected Gift From Mother To Simbu, Tollywood, Kollywood, South Heroes, Eswara-TeluguStop.com

ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా గాడిలో పడటానికి ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం రెండు సినిమాలని శింబు లైన్ లో పెట్టి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

నయనతార, హాన్సికలతో ప్రేమ కథలు బెడిసికొట్టిన తర్వాత కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న శింబు ఫిట్ నెస్ కూడా కోల్పోయి లావైపోయాడు.అయితే మరల ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టి బరువు తగ్గి ఈశ్వరన్, మానాడు సినిమాలు చేశాడు.

ఈ రెండు సినిమాలు అతని కెరియర్ లో డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నవే.రెండింటి మీద మంచి నమ్మకంతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే శింబుకి అతి పెద్ద బలం తల్లి, తండ్రి, అతని తండ్రి ఒకప్పటి దర్శక, నటుడు టి రాజేందర్.అతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇక తన కొత్త సినిమాల కోసం శింబు పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసిన అతని తల్లి అతనికి ఊహించని విధంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.బ్రిటిష్ రేసింగ్ కారు అయినా మినీ కూపర్ ని ప్రత్యేకంగా కొని అతనికి ఇచ్చింది.

తల్లి ఇచ్చిన గిఫ్ట్ తో ఆశ్చర్యానికి గురైన శింబు ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.ఈ కారు ఖరీదు 50 లక్షలు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube