వైరల్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుకోని అతిధి రావడంతో అవాక్కయిన ప్యాసింజర్స్..!

మనిషి తన విలాసవంతమైన అవసరాల కోసం అడవుల్లోని చెట్లను నరికేస్తూ ఉండడంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు కాస్త ఇళ్లల్లోకి, నగరాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి సంచరించడం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం.అడవి ప్రాంతాలు పక్కన ఉండడంతో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి రైతులు వేసుకున్న పంటలను తొక్కి నాశనం చేయడం, చిరుత పులి ఇల్లళ్లకి వచ్చి మనుషులపై దాడి చేయడం, ఇలాంటివి ఈమధ్య తరచూ వింటూనే ఉన్నాం.

 Unexpected Arrival Of An Unexpected Guest At The Delhi Airport ..! Delhi Airport-TeluguStop.com

అయితే ఈసారి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోకి అనుకోని అతిధి రావడంతో ప్యాసింజర్స్ అవాక్కయ్యారు.ఇంతకీ ఆ అనుకోని అతిథి ఎవరు అనుకుంటున్నారా.

ఒక వానరం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనీ విఐపి లాంజ్ లోకి అనుకోకుండా ప్రవేశించింది.విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ప్రయాణికులు ఉన్నట్టుండి వానరం అక్కడ ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ ఆ కోతి ఏకంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్ లోకి ప్రవేశించింది.హై సెక్యూరిటీ ఏరియా గా ఉండే అంతటి ఎయిర్ పోర్ట్ లో ఎంతో మంది భద్రతా సిబ్బంది ఉన్నా, వాళ్ళకళ్ళను కప్పి మరీ ఎయిర్ పోర్ట్ లోకి రావడం ప్రయాణికులకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎయిర్ పోర్ట్ లోకి రావడమే కాకుండా ఓ కూల్ డ్రింక్ స్టాల్ వద్ద ఆ వానరం హల్ చల్ చేసింది.

దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు కొందరు ఈ దృశ్యాన్ని వారి కెమెరాలతో వీడియో తీశారు.ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఎయిర్ పోర్ట్ కి ఇలా జంతువులు వస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటి అని, వాళ్ల రక్షణ ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube