అయోమయంలో అమెరికా ప్రభుత్వం.. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..!!

అగ్ర రాజ్యం అమెరికా ఒక పక్క కరోనా విలయంతో, మళ్ళీ మొదలైన కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడి పోతోంటే మరో వైపు కరోనా మిగిల్చిన ఆర్ధిక భారంతో ఏమి చేయాలోననే ఆలోచనలో పడింది.ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వానికి పెట్టుకుంటున్న నిరుద్యోగ బృతి దరఖాస్తులు చూసి తలలు పట్టుకుంటున్నారు.

 Un Employment Compensation Applications To America Govt, Corona Effect, American-TeluguStop.com

ఏమి చేయాలో కూడా ప్రస్తుతం పాలుపోని పరిస్థితి నెలకొంది.కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది వీధుల్లో నిలబడ్డారు.

మరో వైపు ఉద్యోగ కల్పన చేయాల్సిన కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతన పడ్డాయి.దాంతో నిరుద్యోగుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.


అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.వారం రోజుల క్రితం నిరుద్యోగ బృతి కోసం 7.16 లక్షలు చేరుకోగా వారం తిరగకుండానే ఆ సంఖ్య 8.53 లక్షలకు చేరుకుంది.చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎంతో మంది అమెరికన్స్ నిరుద్యోగ బృతి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది.న్యూయార్క్, ఇల్లనాయిస్ కాలిఫోర్నియా, జర్జియాలలో గతంలో వచ్చిన దరఖాస్తుల కంటే కూడా ఇప్పుడు రెట్టింపు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.


టెక్సాస్ లో వారం క్రితం 20 వేల దరఖాస్తులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 45 వేలకు చేరుకుంది.కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతో వ్యాపారాలు పెద్దగా ఉండకపోవడం వలన ఖర్చులు తగ్గించుకునే క్రమంలో చాలా సంస్థలు, వ్యాపారాలు తమవద్ద పనిచేసే వారిలో కొంత మందిని ఉద్యోగం నుంచి తొలగించడం వలనే మరిన్ని నిరుద్యోగ బృతి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అమెరికా ప్రభుత్వం పీకల్లోతు ఆర్ధిక భారంలోకి వెళ్తుందని, అయితే కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ అమెరికాలోనే తీవ్ర ప్రభావం చూపడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube