టీఆర్ ఎస్ వేసిన ఈ వ్యూహంతో తెరాసకు మద్దతుగా నిరుద్యోగులు..

ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాల నుండి విమర్శలు తప్పవు.అది రాజకీయాలలో చాలా సహజం.

 Unemployed In Support Of Trs With This Strategy Laid Out By Kcr , Ktr, Trs Party-TeluguStop.com

కాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చే కొన్ని విపత్కర పరిస్థితులను మాత్రం చాలా జాగ్రత్తగా స్పందించాలి, చాకచక్యంగా పరిష్కరించాలి.లేకపోతే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిన సమస్య ఉద్యోగ నోటిఫికేషన్లు.అయితే నోటిఫికేషన్ లు విడుదల చేయలేదని చెప్పి నిరుద్యోగులు గుర్రుగా ఉన్న మాట వాస్తవమే అని చెప్పవచ్చు.

అయితే కేసీఆర్ వేసిన ఈ వ్యూహంతో నిరుద్యోగులు కేసీఆర్ కు జేజేలు పలకనున్నారు.అయితే ప్రభుత్వ ఉద్యోగాల పెంపు విషయంలో పాత జోనల్ వ్యవస్థ ఆధారంగా నడుస్తోంది.

అయితే పాత జోనల్ వ్యవస్థ ఆధారంగా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఇలా చాలా రకాల అడ్డంకులు ఉన్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది.

దీంతో ఉద్యోగాల పరంగా పెను మార్పులు జరగనున్నాయి.ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.

ఏది ఏమైనా ఇది నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు.మరి టీఆర్ఎస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube