అద్గదీ అధ్యక్షుడు అంటే అలా ఉండాలి..బిడెన్ నువ్వు సూపరయ్యా...!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ అక్రమ వలస వాసుల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.అమెరికాలో వివక్ష చూపబడుతున్న వారిలో వీరు ప్రధానంగా ఉంటారు.

 Undocumented Immigrants Should Be Vaccinated Against Covid-19 Says Biden, Joe Bi-TeluguStop.com

ట్రంప్ తన హయాంలో అక్రమ వలస దారుల విషయంలో కటినమైన నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పటికి వారి విషయంలో అమెరికాలో వివక్ష కొనసాగుతూనే ఉంటుంది.

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడం తప్పే అందుకు శిక్షలు కూడా ఉంటాయి కానీ అమెరికాలో ఉన్నంత వరకూ వారి క్షేమం చూడాల్సిన భాద్యత తనపై ఉందని భావించారు బిడెన్.

కరోనా మహమ్మారి కారణంగా అక్రమ వలస వాసులు కూడా ఎంతో మంది మృతి చెందారు.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో వలస వాసులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులుగా ప్రకటించారు అధ్యక్షుడు బిడెన్.ఇప్పటికి అమెరికాలో సుమారు 50 మిలియన్ డోసులు వ్యాక్సిన్ వేసి కీలక మెయిలు రాయిని దాటామని అయితే కేవలం అమెరికన్స్ మాత్రమే కాదు అక్రమ వలస వాసులు కూడా ఈ వ్యకిన్స్ వేయించుకోవచ్చని ఎలాంటి భయాలు, ఆందోళనలు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అక్రమ వలస దారులు వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు , కస్టమ్స్ అధికారులు జోక్యం కల్పించుకోరని, అరెస్టులు చేయరని , అసలు ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ ఉండరని ధైర్యంగా ఉండమని బిడెన్ హామీ ఇచ్చారు.ట్రంప్ హయాంలో అక్రమ వలస దారులపై ఉక్కుపాదం మోపారని, కరోనా వైద్య సేవల విషయంలో ఎంతో వివక్షత చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ బిడెన్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ ధైర్యం చెప్పారని అక్రమ వలస వాసుల కుటుంభాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.అమెరికా వ్యాప్తంగా సుమారు 11 మిలియన్ల అక్రమ వలస వాసులు ఉన్నారని, వారందరికీ టీకాలు వేయడానికి వైద్యులు సిద్దంగా ఉన్నారని వైద్య బృందం ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube