ఎంతటివారైనా కరోనా దాసులే… మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కూడా  

Underworld Don Dawood Ibrahim And His Wife Test Positive - Telugu Corona Effect, Covid-19, His Wife Test Positive, Pakistan, Underworld Don Dawood Ibrahim

ప్రపంచ కుభేరుడైన, కోట్ల మంది అభిమానం ఉన్న సెలబ్రిటీ అయిన, కటిక దారిద్ర్యంలో ఉన్న పేదవాడు అయిన అందరిని ఒకేలా చూసేది కేవలం వైరస్ మాత్రమె అని మరోసారి కరోనాతో ప్రూవ్ అయ్యింది.దేవుడు కూడా హోదా పట్టి దర్శనం విషయంలో ముందు పెద్దవాళ్ళకి ఇస్తాడేమో కాని ఈ రోగాలు మాత్రం అందరికి ఒకేలా వస్తాయి.

 Underworld Don Dawood Ibrahim And His Wife Test Positive

చివరికి అండర్ వరల్డ్ డాన్ అయినా సరే.ప్రపంచాన్ని భయపెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇండియాలో పుట్టి ఇండియా మీదనే పగబట్టిన దావూద్ ఇబ్రహీం ఇప్పుడు కరోనాతో చివరి రోజులు గడుపుతున్నాడా అంటే అవుననే మాట బలంగా వినిపిస్తుంది.

దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.పాకిస్థాన్ ప్రభుత్వంలోని ఓ విశ్వసనీయమైన వ్యక్తి నుంచి ఈ సమాచారం తెలిసినట్టు పాక్ మీడియా వెల్లడించింది.

ఎంతటివారైనా కరోనా దాసులే… మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కూడా-General-Telugu-Telugu Tollywood Photo Image

కరాచీలోని మిలిటరీ ఆసుపత్రిలో దావూద్ చికిత్స పొందుతున్నాడు.అతన భార్య కూడా అక్కడే చికిత్స పొందుతోంది.మరోపక్క, దావూద్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.2003లో దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఇండియా, అమెరికా ప్రకటించాయి.ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లలో ఒకరిగా దావూద్ ను అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ప్రకటించింది.ఇంత పెద్ద మాఫియా డాన్ చివరికి కరోనా వైరస్ కి భయపడే పరిస్థితి వచ్చింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Underworld Don Dawood Ibrahim And His Wife Test Positive Related Telugu News,Photos/Pics,Images..

footer-test