ఇంటికి పిలిచి ఫ్రెండ్ కు మందుపార్టీ.. మద్యం మత్తులో చేసిన దారుణం చూసి పక్కింటి మహిళ కేకలు..!

Under The Influence Of Alcohol Man Kills Friend Crieme News, Madhya Pradesh , Crime News , Crime , Alcohol , Kills Friend ,women,

భార్యను పుట్టింటికి పంపించి.స్నేహితుడిని ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించి చుట్టుపక్కల వాళ్లను భయభ్రాంతులకు గురిచేశాడు ఓ వ్యక్తి.

 Under The Influence Of Alcohol Man Kills Friend Crieme News, Madhya Pradesh , Cr-TeluguStop.com

వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్( Madhya Pradesh ) లోని కొత్వాలి పరిధిలో ఉండే మజ్మని కాలా గ్రామంలో సూరజ్ అనే వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లడంతో, స్నేహితుడు శంభును మందు పార్టీ ఇస్తానని ఇంటికి ఆహ్వానించాడు.సరదాగా స్నేహితులిద్దరూ మద్యం తాగుతూ తెగ ఎంజాయ్ చేశారు.

అయితే ఇద్దరి మధ్యలో ఒక విషయంపై గొడవ మొదలై కొట్టుకునే స్థాయికి చేరింది.క్షణికావేశంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా సూరజ్ పక్కనే ఉన్న ఓ ఆయుధంతో శంభు పై దాడి చేయగా, రక్తపు మడుగులోకి జారి శంభు ప్రాణాలు విడిచాడు.

మద్యం మత్తులో ఉన్న సూరజ్ తన స్నేహితుడు శంభు శరీరాన్ని 12 ముక్కలు చేశాడు.శరీరం నుండి తలను వేరు చేసి సాయంత్రం నాలుగు గంటల సమయంలో శంభు తల పట్టుకుని డాబాపై ఎక్కి వాకింగ్ చేయడం ప్రారంభించాడు.

సూరజ్ చేతిలో తలను చూసిన పక్కింటి మహిళ( women ) ఒక్కసారిగా భయపడి కేకలు వేయడం ప్రారంభించింది.ఆమె కేకలు విన్న సూరజ్ చేతిలో ఉండే తలను విసిరేశాడు.

ఇంతలో చుట్టుపక్కల వారు సంఘటన ప్రాంతానికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చే వరకు సూరజ్ పారిపోకుండా అక్కడే ఓ మూలన కూర్చొని ఉన్నాడు.సూరజ్ ను చూసి చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు( police ) కూడా షాక్ అయ్యారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సూరజ్ నరరూప రాక్షసుడిలా ప్రవర్తించి గ్రామస్థులందరినీ భయభ్రాంతులకు గురి చేయడంతో, ఇటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Video : Latest - #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube