అండర్-19 స్టార్ క్రికెట‌ర్ ఉన్ముక్త్ చంద్ వివాహం.. ఎవ‌రితో అంటే

అండర్–19 వరల్డ్ కప్ ను ఇండియాకు అందించిన ఉన్ముక్త్ చంద్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు.ఫిట్ నెస్, న్యూట్రీషియన్ కోచ్ గా ఉన్న సిమ్రాన్ ఖోస్లా అనే మహిళను మనువాడాడు.

 Under-19 Star Cricketer Unmukt Chand Is Getting Married , Unmukt Chand, Cricket-TeluguStop.com

ఎన్నో రోజులుగా స్ట్రాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఆదివారం ఒక్కటయింది.అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఉన్ముక్త్ సిమ్రాన్ మెడలో తాళి కట్టాడు.

అసలు భారత జట్టుకు వరల్డ్ కప్ అందించాడంటే అతడి కెరీర్ రాకెట్ జెట్ స్పీడుతో దూసుకుపోతుందని అందరూ భావించారు.కానీ అలా జరగలేదు.

అసలేమైందో ఏమో కానీ ఉన్ముక్త్ చంద్ మాత్రం భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు.ఎలాగైతేనేం అతడు మాత్రం చివరికి ఓ ఇంటి వాడు కావడం శుభపరిణామం.

ఉన్ముక్త్ చంద్ వివాహం చేసుకున్న సిమ్రాన్ ఖోస్లా గురించి అభిమానులు ఎంక్వైరీలు చేయడం మొదలు పెట్టారు.అసలింతకీ ఆమె ఎవరు అని తెగ సెర్చ్ చేస్తున్నారు.ఆమె ప్రముఖ ఫిట్ నెస్, న్యూట్రీషియన్ ట్రైనర్.సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాలో వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

వాటికి మేం ఎప్పటికీ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాం.అంటూ క్యాప్షన్ ను జత చేశారు.

జూనియర్ వరల్డ్ కప్ అందించిన తర్వాత ఉన్ముక్త్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.

Telugu Cricket, Cricketerunmukt, Unmukt Chand-Latest News - Telugu

అందరూ అతడిని పెద్ద స్టార్ లా చూడడం మొదలు పెట్టారు.ఇక భారత జట్టుకు ఉన్ముక్త్ సేవలందిస్తాడని అందరూ భావించారు.అందరూ అనుకున్నట్లుగానే అతడు క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైన్ చేశాడు.

కానీ ఏమయిందో ఏమో ఒక్క సారిగా ఉన్ముక్త్ ఫామ్ కోల్పోయిడు.దీంతో అతడు ఐపీఎల్ కు కూడా దూరంగా ఉన్నాడు.

ఈ ఆటగాడు పెద్దగా రాణించకపోవడంతో ఢిల్లీ రంజీ జట్టు కూడా అతడిని టీమ్ నుంచి తొలగించింది.దీంతో ఉన్ముక్త్ ఉత్తరాఖండ్ జట్టుకు ఆడాలని డిసైడ్ అయ్యాడు.

అక్కడ కొన్ని రోజుల పాటు క్రికెట్ కూడా ఆడాడు.కానీ ఏం జరిగిందో ఏమో అతడు సడెన్ గా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube