ఆ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు అదే శాప‌మైందా...?

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి.అయితే, అదేస‌మ‌యంలో వ్యూహం కూడా ఉండాలి.

 Ycp Party Leaders Against Undavalli Sridevi, Ycp Mla, Undavalli Sridevi, Ys Jaga-TeluguStop.com

ఎక్క‌డ దూకుడుగా ముందుకు సాగాలి.ఎక్క‌డ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి? అనే విష‌యాల్లో ప‌ట్టు కోల్పోతే.నాయ‌కులు ఎంత‌టివారైనా పిల్లిమొగ్గ‌లు వేయ‌డం ఖాయం.ఈ ఫార్ములా అన్ని పార్టీల్లోని నేత‌ల‌కూ వ‌ర్తిస్తుంది.అదేస‌మ‌యంలో సీనియ‌ర్ల‌కు, జూనియ‌ర్ల‌కు కూడా వ‌ర్తిస్తుంది.అయితే, ఒక్కొక్క సారి ఏదైనా స‌మ‌స్య పీక‌ల‌వ‌ర‌కు వ‌చ్చినా.

సీనియ‌ర్లు ఏదో ఒక విధంగా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు.అవ‌స‌ర‌మైతే.

త‌మ‌కున్న ప‌రిచ‌యాల కార‌ణంగా.ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకుని వివాదాల‌ను ముద‌ర‌కుండా జాగ్ర‌త్త‌ప‌డి.

ముందుకు సాగుతారు.
అయితే.

జూనియ‌ర్ల విష‌యంలో ఇలాంటి సూత్రం క‌చ్చితంగా పాటించాల్సిందే.ఎక్క‌డ వేయాల్సిన వ్యూహం అక్క‌డ వేయాలి.

ఎక్క‌డ దూకుడు ఉండాలో అక్క‌డ ఉండాలి.ఇవి లోపిస్తే.

ఇప్పుడు వైసీపీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే మాదిరిగా త‌ల‌పట్టుకోవాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు.వైసీపీలో జ‌గ‌న్‌మిన‌హా 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే.

అత్యంత వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా రికార్డులు సృష్టించుకున్నారు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.ఉన్న‌త విద్యావంతురాలు.ప్ర‌జ‌ల‌తో సంబంధాలు క‌లిగి ఉన్న వ్య‌క్తే అయిన‌ప్ప‌టికీ.రాజ‌కీయాల‌కు కొత్త‌.పైగా గుంటూరు వంటి రాజ‌కీయ దురంధ‌రులు ఉన్న జిల్లాలో.ఎలా మెలగాలో ఆమె ఇప్ప‌టికీ తెలుసుకోలేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.
అవినీతి ఆరోప‌ణ‌లు లేన‌ప్ప‌టికీ.ఎమ్మెల్యే అంటే.స‌ర్వం అనుకోవ‌డం.త‌న మాటే చెల్లుబాటు కావ‌ల‌ని త‌పించ‌డం.

వంటివి ఆమెకు శాపంగా మారాయి.ఈ క్ర‌మంలో ఎదుర‌వుతున్న ప‌రిణామాల నుంచి త‌ప్పించుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా క‌నిపించ‌డం లేదు.

ఎంపీ నందిగం సురేష్‌తో వివాదాలు.పోలీసుల‌పై ఆధిప‌త్య ధోర‌ణి.

ఓ కార్య‌క‌ర్త నుంచి ఎన్నిక‌ల నిదులు సేక‌రించి.తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డం, పేకాట క్ల‌బ్బుల్లో దొరికిన వారికి.

ఎమ్మెల్యే వ‌త్తాసు ప‌ల‌క‌డం.వంటివి ఆమెకు పూర్తిగా మైన‌స్ అయ్యాయి.

 ఇవి తీవ్ర వివాదాలుగా ముదిరి.ప్ర‌తిప‌క్షాల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో కౌంట‌ర్ ఇవ్వ‌లేక ఉండ‌వ‌ల్లి స‌త‌మ‌తం కావ‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే సొంత పార్టీ నాయ‌కులు కూడా ఆమెకు స‌హ‌క‌రించ‌లేదు.దీనికి కార‌ణం.

ఆమెకు సొంత‌పార్టీలోను.త‌న జిల్లాల‌లోనూ నేత‌ల‌తో క‌లిసిమెలిసి లేక‌పోవ‌డం వంటివి ఆమెకు ఇబ్బందిక‌రంగా మారాయి.

ఈ ప‌రిణామాలు పార్టీ అధిష్టానం కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో ఇప్పుడు ఆమెకు అంద‌రూ దూర‌మ‌య్యారు.ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

ఎమ్మెల్యే మంచిదే.కానీ, వ్యూహం లేక‌పోవ‌డం, దూకుడు స్వ‌భావం వంటివి ఆమెను మైన‌స్ చేస్తున్నాయి.

ఇప్ప‌టికైనా ఆమె మారాలి.అని సూచిస్తున్నారు.

మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube