మీడియాకి భయపడితే పతనమైనట్లే! జగన్ పై ఉండవల్లి కామెంట్స్  

Undavalli Point Blank Counter To Ap Cm Jagan - Telugu Ap Cm Jagan, Ap Politics, Janasena, Tdp, Undavalli Point Blank Counter, Ysrcp

ఏపీ రాజకీయాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు.ఎక్కువగా చంద్రబాబు, టీడీపీని లక్ష్యంగా చేసుకొని వారు ప్రజలకి చేసిన మోసాలని ప్రెస్ మీట్ లు పెట్టి ఎకిపారేస్తూ ఉంటారు.

Undavalli Point Blank Counter To Ap Cm Jagan

అలాగే ఎవరు అధికారంలో ఉన్న వారు చేసిన తప్పులని ఎత్తిచూపించడంలో నిర్మొహమాటంగా ఉండవల్లి ఉంటారనే పేరుంది.అందుకే ఒకప్పుడు అతను కాంగ్రెస్ లో ఉన్న కూడా ప్రస్తుతం మీడియా అతని వ్యాఖ్యలకి ప్రాధాన్యత ఇస్తుంది.

చంద్రబాబు మీద బలంగా విమర్శలు చేసినట్లు ఉండవల్లి పవన్ కళ్యాణ్, జగన్ మీద చేయరనే అపవాదు ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఉండవల్లి మీడియా ముందుకి వచ్చి జగన్ పరిపాలనలో వైఫల్యాలని ఎండగట్టె ప్రయత్నం చేశారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని తప్పు పడుతూ లేఖ కూడా రాసారు.ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు అంశం పెద్ద ఇష్యూగా మారిందని ఈ సందర్భంగా ఉండవల్లి అన్నారు.

అయితే తాజాగా ఏపీలో రెండు మీడియా సంస్థల ప్రసారాలు జగన్ సర్కార్ నిలిపెసిందని ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కూడా అతనికి మీడియా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండేదని అయితే ఏనాడూ కూడా చానల్స్ పై నిషేధం వంటివి చేయలేదని అన్నారు.

మీడియాకి భయపడిన సమయం నుంచి మన పతనం మొదలైనట్లు అవుతుందని అన్నారు.ఏ చానల్స్ ని అయితే నిషేధించారో వాటికి ప్రజలలో ఆదరణ పెరిగిపోతూ ఉంటుందని తెలిపారు.

ఈ విషయంలో జగన్ నిర్ణయంపై మరోసారి పునరాలోచించుకోవాలి అని సలహా ఇచ్చారు.మరి ఉండవల్లి సలహాని జగన్ ఎంత వరకు తీసుకుంటాడు అనేది చూడాలి.

తాజా వార్తలు