ఏపీ రాజకీయాలపై మాట్లాడిన ఉండవల్లి,పవన్ పై కూడా

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ముక్కు సూటిగా మాట్లాడుతారు అన్న విషయం అందరికి తెలిసిందే.

 Undavalli Arunkumar Spoke About Pawan Kalyan Re Entry In Movies-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఏపీ రాజకీయాలపై,అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా స్పందించారు.పవన్ సినిమా ల రీ ఎంట్రీ పై ఆయన స్పందిస్తూ, ఈ విషయం పవన్ కు ముందే చెప్పాను అని కానీ అప్పట్లో ఆయన అంగీకరించలేదు అని ఉండవల్లి అన్నారు.

ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలను చేయను అని ప్రకటించారు.అయితే అప్పుడే ఆయనను కలిసినప్పుడు సినిమా అనేది మీ వృత్తి దానిని ఆపవద్దు అంటూ సూచించాను.

Telugu Chandrababu, Janasenabjp, Pawankalyan, Pawan Kalyan, Tdp Cpi, Undavaliaru

అయితే అప్పుడు ఆయన రాజకీయాలు,సినిమాలు రెండూ కుదరవని అందుకే సినిమా లకు స్వస్తి చెబుతాను అని పవన్ అన్నారు అంటూ గుర్తు చేసుకున్నారు.అయితే అప్పట్లో ఆయన సీఎం అవుతారని అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు.అయితే ఇప్పుడు నాలుగేళ్ళ వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఉంటారు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేనని, అదే సరైన నిర్ణయంగా ఆయన భావిస్తున్నానని పేర్కొన్నారు.

అంతేకాకుండా జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి కూడా ఆయన స్పందిస్తూ, పవన్ ప్రసుతం అధికారంలో లేరు కాబట్టి ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని, పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చని,అలానే పవన్ కల్యాణ్ పరిస్థితీ కూడా పెద్దగా తేడాలేదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube