ఆ కీలక నేతకి...పవన్ భారీ ఆఫర్..???  

Undavalli Arun Kumar To Join In Pawan Kalyan\'s Janasena-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన వ్యుహాలకి తగ్గట్టుగా ఏపీ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ప్రజా పోరాట యాత్రాలని పక్కన పెట్టి మరీ పార్టీ నిర్మాణం పై, అభ్యర్ధుల విషయంలో కసరత్తులు చేస్తున్నాడు.

Undavalli Arun Kumar To Join In Pawan Kalyan\'s Janasena--Undavalli Arun Kumar To Join In Pawan Kalyan's Janasena-

మరో పక్క పవన్ కి వచ్చే వినతులు ఇలా పవన్ బిజీ బిజీ గా గడుపుతున్నాడు.తన వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తలపండిన నేత , రాజకీయ దురందరుడు గా , చంద్రబాబు నాయుడికే చుక్కలు చూపించే వ్యక్తిగా ఆయన పేరొందిన ఓ కీలక వ్యక్తిని రాజ్య సభకి పంపడానికి సిద్దం అవుతున్నాడు.

Undavalli Arun Kumar To Join In Pawan Kalyan\'s Janasena--Undavalli Arun Kumar To Join In Pawan Kalyan's Janasena-

అందుకు తగ్గ వ్యుహాలని కూడా సిద్దం చేశాడని అంటున్నారు.ఇంతకీ ఎవరా కీలక నేత.లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.ఉండవల్లి కి పవన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఉండవల్లి అంటే పవన్ కళ్యాణ్ కి మొట్టమొదటి నుంచీ ఎంతో గౌరవ ఉంది ఆ గౌరవంతోనే పవన్ ఆయన్ని సమావేశాలకి సైతం క్రియాశీలకంగా ఉంచేవారు.

అంతేకాదు ఉండవల్లి కొంత కీలం క్రితం నివహించిన అఖిల పక్ష సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

అయితే ఈ సమావేశానికి ముందు పవన్ తన కార్యకర్తలతో, నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఉడవల్లి పిలవగానే సమావేశం రద్దు చేసుకుని మరీ చటుక్కున ఉండవల్లి దగ్గరకు వెళ్ళారు.ఎందుకంటే విషయ జ్ఞానం ఉన్న ఉండవల్లి అంటే పవన్ కి ఎంతో గౌరవం.

అంతేకాదు ఇటువంటి మంచి మనిషి మన పార్టీలో ఉంది ఉంటె తప్పకుండా విజయం అందుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకంగా భావిస్తున్నారు జనసేనాని.

ఈ క్రమంలోనే ఉండవల్లిని జనసేన నుంచీ రాజ్యసభకి పంపాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది.జనసేనలోకి ఉండవల్లి ని చేరాలని గతంలోనే పవన్ పలు మార్లు అడిగారట.అయితే ఉండవల్లి సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయం పై పవన్ ఉండవల్లి తో చర్చలు జరిపారని.మేధావులకి నిలయం అయిన రాజ్యసభ కి ఉండవల్లి జనసేన తరుపున వెళ్తే జనసేనకి మరింత బలం వస్తుందని పవన్ సన్నిహితులతో అన్నట్టుగా తెలుస్తోంది.

మరి జనసేనుడు ఇచ్చిన ఆఫర్ ని ఉండవల్లి స్వీకరిస్తారో లేదో వచ్చి చూడాల్సిందే .