చంద్రబాబు పై ఉండవల్లి ఉప్పెనలా కురిపించిన కామెంట్స్ ..!!     2018-09-25   15:14:02  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారు ధ్వజమెత్తారు..రాజకీయాలలో చంద్రబాబు లాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసేవాళ్ళు మరొకరు ఉండరు అంటూ ఫైర్ అయ్యారు..గోదావరి పుష్కరాల్లో మృతులపై సోమయాజుల కమీషన్, కిడారి పై మావోల హత్య పోలవరం ఇలాంటి అంశాలపై ఉతికి ఆరేశారు..చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ముష్టివాడు సంపాదనని కూడా దోచుకునే విధంగా మారిందని ఎద్దేవా చేశారు..

అంతేకాదు కేవలం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమె కాంట్రాక్టర్లలతో కుమ్మక్కయ్యిందని మండిపడ్డారు..ఇదిలాఉంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వానికి కాపుకాస్తున్న కుటుంభరావు పై కూడా ఉండవల్లి ఫైర్ అయ్యారు. ప్రతీ విషయానికి ఒంటికాలుపై లేచి బాబు అడుగులకి మడుగులు వత్తే కుటుంభరావు కి ఓపెన్ చాలెంజ్ చేశారు..

ప్రతీ విషయంలోను ఓపెన్ గా చాలెంజ్ చేసే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్న క్యాంటిన్లు, ఆదరణ, పోలవరం ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

చంద్రబాబు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక కుటుంబరావు తప్పకుండా ఉంటాడని చాలా విషయాలలో చంద్రబాబు ఇంజనీర్లు చెప్పాల్సిన విషయాలని కుటుంభరావు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఒక ముష్టి వాడిని దోచుకోవాలని సామాన్యంగా ఎవరికీ అనిపించదని కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకన్నా అధ్వాన్నంగా తయారైందంటూ ధ్వజమెత్తారు. ఐక్య రాజ్యసమితిలో చంద్రబాబు మాట్లాడినట్లు చెప్పుకోవటాన్ని కూడా ఉండవల్లి ఎద్దేవా చేశారు.

Undavalli Arun Kumar Sensational Comments on N Chandrababu Naidu-Elections In AP,N Chandrababu Naidu,TDP,Trolls On Chandrababu Naidu,Undavalli Arun Kumar,Undavalli Arun Kumar Sensational Comments On N Chandrababu Naidu

అసలు పోలవరం లో జరిగిన అక్రమాలు ఎక్కడా జరగలేదని ప్లవరంతో పాటు పలు పధకాల్లో ఎన్నో అవినీతి బాగోతాలు జరుగుతున్నాయి అని స్వయంగా కాగ్ తెలిపినా సరే ఎవరూ నోరు మెదపక పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ ఉండవల్లి స్పష్టం చేశారు.