పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భవిష్యత్తు అతనిదే అంటున్న ఉండవల్లి

ఏపీ రాజకీయాలలో మూడోప్రత్యామ్నాయంగా వచ్చి ప్రజలలోకి వెళ్ళిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసి స్థానలలో కూడా ఓడిపోయాడు.

 Undavalli Arun Kumar Interesting Comments On Pawan Kalyan Lose Victory-TeluguStop.com

ఒక జనసేన పార్టీ నుంచు కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవగాలిగారు.కనీసం ప్రధాన పార్టీలకి పోటీ కూడా ఇవ్వలేకపోయాడు.

దీంతో పవన్ కళ్యాణ్ ని ద్వేషించే చాలా మంది ఇప్పుడు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడం మొదలెట్టారు.అయితే మార్పు ఆశించే చాలా మంది జనసేనకి మద్దతుగా నిలబడ్డారు.

ఇదిలా ఉంటే తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ఉండొచ్చు కాని అతను బాధపడాల్సిన అవసరం లేదని.

బహుజన సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు కాన్సిరాం కూడా మొదటి సారి ఓడిపోయినా వ్యక్తే అని అన్నారు.అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఏపీ భవిష్యత్తు రాజకీయాలలో కీలక వ్యక్తిగా మారుతాడని ఉండవల్లి చెప్పడం విశేషం.

అలాగే అవినీతి రహిత పాలన అందించే వ్యవస్థలని ప్రక్షాళన చేసే విధంగా జగన్ పరిపాలన ఉంటే మరో ముప్పై ఏళ్ళు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటాడని ఉండవల్లి చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube