సీఎం జగన్‎కు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ..!  

Ex MP undavalli arun kumar, cm jagan, corona virus, corona update, - Telugu Cm Jagan, Corona Update, Corona Virus, Ex Mp Undavalli Arun Kumar

కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో గెలిచేందుకు సీఎం జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు సీఎం జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లేఖ రాశారు.

 Undavalli Arun Kumar Cm Jagan Corona Virus

రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని లేఖలో పేర్కొన్నారు.కరోనా రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.

ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని.ప్రభుత్వం తరపు నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలని కోరారు.

సీఎం జగన్‎కు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ..-Latest News-Telugu Tollywood Photo Image

రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే ఓ ఫంక్షన్ హాళ్లును అద్దెకు తీసుకుని.దానిలో 60 పడకలతో కరోనా సెంటర్ ను నడుపుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించి వాటికి ఫీజును ప్రభుత్వం నిర్దేశించాలని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

#Corona Virus #CM Jagan #Corona Update

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Undavalli Arun Kumar Cm Jagan Corona Virus Related Telugu News,Photos/Pics,Images..