ఆ పాటతో బాలుని గుర్తు చేసిన బుడ్డోడు.. వైరల్ వీడియో!

దివంగత గాయకుడు ఎస్.పీ.

 Uncle Viral Video That Reminded The Boy With That Song, Sp Balasubramaniam, Vira-TeluguStop.com

బాలసుబ్రహ్మణ్యం గారు గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిన వ్యక్తి.తెలుగు ఇండస్ట్రీలో ఓ మంచి గాయకుడిని కోల్పోయిన విషయం ఇప్పటికీ అందరి హృదయాలను కదిలిస్తూనే ఉంది.

గత ఏడాది కరోనా బారిన పడి అనారోగ్యం సమస్యతో చికిత్స పొందుతూ మరణించిన ఆయన.ఎందరో గుండెల్లో నిలిచారు.ఎన్నో సినిమాలలో ఎన్నో పాటలు పాడిన బాలు.ఇప్పటికీ ఆ పాటలతో బతికే ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈయన సినిమాలలో కూడా కొన్ని పాత్రలలో నటించారు.ఇక ఎన్నో సినిమాల్లో తన పాటలను వినిపించన ఆయన.బుల్లితెరలో కూడా తన పాటలతో ఎన్నో షో లలో పాల్గొన్నాడు.ఎంతోమందికి తన పాటలను వినిపించాడు.

నేర్పించాడు.ఇప్పటికే ఆయన దగ్గర ఎంతోమంది పాటలు నేర్చుకున్న శిష్యులు ఉన్నారు.

ఇదిలా ఉంటే స్వాతిముత్యం సినిమాలో ఆయన పాడిన పాట ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మ‘.

కమల్ హాసన్, రాధిక నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.ఈ పాటను మాత్రం ఎంతో చక్కగా పాడాడు బాలసుబ్రమణ్యం.ఇక ఇప్పటికే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఓ బుడ్డోడు పాడి అందరిని బాల సుబ్రహ్మణ్యం గుర్తు చేసుకునేలా చేశాడు.ఆవిర్భవ్ అనే ఓ బుడ్డోడు తన పాటలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాడు.

సరిగ్గా మాటలు రాని ఈ బుడ్డోడు కొన్ని పాటల తో బాగా ఆకట్టుకున్నాడు.ఇక బాలసుబ్రమణ్యం పాడిన సువ్వి సువ్వి పాటను పాడి బాగా ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా ఆ పాటని విన్న ప్రతి ఒక్కరూ ఆ బుడ్డోడిని తెగ ప్రశంసలు కురిపించారు.కాగా ఈ పాటను గతంలో పాడగా.

ఇప్పటికీ ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube