కొత్త జంటకు గిఫ్ట్‌ ఇచ్చాడు... మూడు నెలల తర్వాత పొరపాటున ఇచ్చాను అని వెనక్కు తీసుకున్నాడు

ఇండియాలో పెళ్లిలు లేదా ఏదైనా శుభకార్యాలకు హాజరు అయిన వారు గిఫ్ట్‌లు చదివించడం చాలా కామన్‌గా వస్తున్న విషయం.మన తెలుగులో వీటిని కట్నాలు అని కూడా అంటారు.

 Uncle Asks Bride To Return Wedding Gift1-TeluguStop.com

బంధువులు కట్నాల రూపంలో డబ్బులు ఇస్తే, కొందరు వస్తువుల రూపంలో గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు.కేవలం ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ గిఫ్ట్‌ల సాంప్రదాయాలు ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గిఫ్ట్‌లుగా బొమ్మలు ఇవ్వకుండా నగదు రూపంలో ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు.గిఫ్ట్‌ రూపంలో వచ్చిన నగదుతో హనీమూన్‌ను కొత్త జంట ప్లాన్‌ చేసుకోవడం జరుగుతుంది.

కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఒక కొత్త జంటకు వింత అనుభవం ఎదురైంది.పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లేందుకు వారు గిఫ్ట్‌ రూపంలో నగదును ఇవ్వాలంటూ కోరడం జరిగింది.

అందుకు చాలా మంది బందువులు బాగానే తమకు తోచినంతగా చెక్‌ల రూపంలో, నగదు రూపంలో ఇచ్చారు.అలా వారికి పెద్ద మొత్తంలోనే డబ్బు వచ్చి చేరింది.అయితే అందరిలో కంటే వరుడి మామయ్య ఇచ్చిన గిఫ్ట్‌ చూసి ఆ జంట ఆశ్చర్య పోయారు.అందరి కంటే ఎక్కువగా 160 ఫౌండ్లు అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు 15000 రూపాయలు.

ఆయన ఇచ్చిన పదిహేను వేల రూపాయల ఫౌండ్లకు కొత్త జంట చాలా సంతోషించింది.మొత్తం వచ్చిన డబ్బుతో హాయిగా హనీమూన్‌ను ఎంజాయ్‌ చేశారు.పెళ్లి అయిన మూడు నెలల తర్వాత వరుడి మామయ్య పొరపాటు జరిగింది, దయచేసి నేను ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయండి అంటూ వారి వద్దకు వచ్చాడట.16 ఫౌండ్లను ఇవ్వాలనుకున్న నేను పొరపాటున 160 ఫౌండ్లని రాశాను.అందుకే 16 ఫౌండ్లు ఉంచుకుని మిగిలిన మొత్తంను తిరిగి ఇవ్వాల్సిందిగా ఆయన కోరాడట.దాంతో మేము అవాక్కయ్యాము.

ఆయన ఆ డబ్బును అడగడం మాకు ఆశ్చర్యంగా అనిపించిందని వధువు చెప్పుకొచ్చింది.కాస్త ఇబ్బంది అయినా కూడా ఆ డబ్బును ఆయనకు తిరిగి ఇచ్చామని ఆమె చెప్పుకొచ్చింది.

మా కొత్త సంసారంలో జరిగిన ఈ చేదు అనుభవంను ఎప్పటికి మర్చి పోలేమని ఆమె చెప్పుకొచ్చింది.ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక ఫేస్‌ బుక్‌ పేజీలో ఈ విషయం ప్రచురితం అయ్యింది.దాంతో ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube