పాక్ విషయంలో 1992 లో జరిగిందే మరోసారి రిపీట్ అవుతుందా!  

Uncanny Similarities Between Pakistan\'s 1992 And 2019 World Cup Campaigns-imran Khan,pakistan,uncanny Similarities,world Cup

పొరుగుదేశం పాకిస్థాన్ విషయంలో 1992 లో జరిగిన సీనే మరోసారి రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు 1992 లో ఏమి జరిగింది, 27 ఏళ్ల క్రితం జరిగినది మళ్లీ ఇప్పుడు ఏమి రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారా. 1992 లో పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ ని గెలుచుకుంది. అయితే అప్పుడు ఆ సిరీస్ లో కూడా సరిగ్గా ఇప్పుడు ఏమి జరిగిందో అదే జరిగిందట. అంటే తోలి మ్యాచ్ లో ఓటమి, రెండో మ్యాచ్ లో గెలుపు,మూడో మ్యాచ్ వర్షార్పణం. ఇలా ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఏదైతే జరిగింది ఇప్పుడు ప్రపంచ కప్ లో కూడా పాక్ అదే సీక్వెల్ కొనసాగిస్తుంది..

పాక్ విషయంలో 1992 లో జరిగిందే మరోసారి రిపీట్ అవుతుందా!-Uncanny Similarities Between Pakistan's 1992 And 2019 World Cup Campaigns

వరుసగా ఏడూ మ్యాచ్ ల ఫలితాలు పునరావృతం కావడం ఠీ ఇప్పుడు పాక్ సోషల్ మీడియా దీనిపై కోడై కూస్తుంది. 1992 మరో సారి రిపీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియా లో తెగ పోస్ట్ లు చేస్తున్నారు. దాదాపు ఆ నాడు జరిగిన టోర్నీ లో ఎలాంటి ఫలితాలు అయితే వెల్లడి అయ్యాయో సరిగ్గా అలాంటి ఫలితాలే ఇప్పుడు పునరావృతం కావడం విశేషం. అప్పుడుకూడా మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, ఈ సారి ప్రపంచ కప్ లో కూడా మూడో మ్యాచ్ వర్షార్పణం కావడం, అలానే ఆ నాడు న్యూజిలాండ్ పై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టగా, ఈ సారి కూడా న్యూజిలాండ్ ని ఓడించి సెమీస్ అవకాశాలు మెరుగు పరుచుకుంది.

ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే మళ్లీ మరోసారి 1992 ఫలితాలే రిపీట్ అవుతాయి అన్నట్లుగా పాక్ ఆశిస్తుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే అప్పటిలో పాక్ ఆడిన ఆరో మ్యాచ్ లో అమిర్ సోహైల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అవార్డు దక్కించుకోగా,ఈ సారి జరిగిన ఆరో మ్యాచ్ లో హారిస్ సోహైల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. దీనితో ఇక పాక్ అభిమానులు అప్పటిలాగే తమ జట్టు ప్రపంచకప్ కొట్టుకొస్తుంది అంటూ తమ తమ నమ్మకాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.