తాగుబోతు నర్సు డెలవరీ చేస్తే గర్బంలోనే రెండు ముక్కలైన శిషువు.... కన్నీరు పెట్టించే ఉదంతం  

  • హాస్పిటల్స్‌ను దేవాలయాలుగా భావిస్తాం. దేవుడు ప్రాణం ఇస్తే, ఆ ప్రాణాలను నిలిపే ప్రాంతాలు హాస్పిటల్స్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరణం, పుట్టుక అన్ని హాస్పిటల్స్‌లో జరుగుతాయి. కాని హాస్పిటల్స్‌లో మరణం కంటే జననాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు హాస్పిటల్‌పై నమ్మకంతో వెళ్తూ ఉంటారు. అలాగే రాజస్థాన్‌లోని ఒక హాస్పిటల్‌కు కూడా నిండు గర్బినినీ తీసుకుని ఆమె కుటుంబ సభ్యులు వెళ్లారు. పెద్ద ప్రాణం, చిన్న ప్రాణం రెంటిని కాపాడతారని హాస్పిటల్‌కు వెళ్లిన వారికి కన్నీరు మిగిలింది.

  • Unborn Baby Decapitated In Botched-Up Delivery Jaisalmer-Jaisalmer Ramgarh Hospital Nurse Leaves Head Inside Rajasthan

    Unborn Baby Decapitated In Botched-Up Delivery In Jaisalmer

  • పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్‌ జైసల్మేర్‌ రాంగఢ్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు ఈనెల ఆరవ తారీకున దీక్షా కన్వర్‌ అనే గర్బినిని పురిటి నొప్పులతో తీసుకు వచ్చారు. ఆ హాస్పిటల్‌లో ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ లేడు. అక్కడ కేవలం ఒక మేల్‌ నర్స్‌ ఉన్నాడు. అతడు కూడా తాగి ఉన్నాడు. తాగి ఉన్న ఆ నర్స్‌ ఆమెకు పురుడు పోసేందుకు ప్రయత్నించాడు. దీక్షా డెలవరీ అవుతున్న సమయంలో శిషువు సగం బయటకు వచ్చిందట. ఆ సమయంలో మెల్లగా జాగ్రత్తగా ఆ శిషువును బయటకు తీయాల్సి ఉంటుంది. కాని ఆ మేల్‌ నర్స్‌ బలంగా లాగడంతో తల బాగం లోపల ఉండి పోయి శిషువు కాలేయంతో పాటు అవయవాలు చిందర వందర అయ్యాయి.

  • Unborn Baby Decapitated In Botched-Up Delivery Jaisalmer-Jaisalmer Ramgarh Hospital Nurse Leaves Head Inside Rajasthan
  • ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచాడు. మాయ ఆమె కడుపులో ఉందని నమ్మించాడు. శిషువు అనారోగ్యం కారణంగా చనిపోయిందని చెప్పాడు. దాంతో దీక్ష తరపు బంధువులు నమ్మారు. అయితే దీక్షకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె కడుపులో శిషువు తల ఉందని గుర్తించారు. ఆ మేల్‌ నర్స్‌ను సీరియస్‌గా ప్రశ్నించగా పూర్తి విషయాన్ని కక్కాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని మరియు ఆ సమయంలో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఎంత కేసు నమోదు చేస్తే ఏం లాభం, ఆ నర్స్‌కు ఉరి శిక్ష వేస్తే ఏం లాభం ఎన్నో కలలు కన్న ఆ తల్లి కడుపు కోతను తీసుకు వస్తారా. ఈ సంఘటన స్థానికులను కన్నీరు మున్నీరుకు గురి చేసింది.