రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి  

Unbelievable Myths About Blood Donation-

అన్నిటికంటే అన్నదానం మిన్న అనేది చాలా పాతమాట. అన్నం దానం యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు కాని, ఇప్పుడున్న పరిస్థితులలో రక్తదానానికి మించిన దానం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ఈ రక్తదానం మీద కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి..

రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి-

వాటి వలన ఎంతోమంది ఔత్సాహికులు రక్తందానం చేయడానికి సంశయిస్తుంటారు.* రక్తదానం వలన ఏయిడ్స్ సోకుతుంది అంటారు. ఇక్కడ రక్తం దానం చేయడం వలన కాదు, నీడిల్ కొత్తది వాడకపోవడం వలన సోకవచ్చు.

ఇప్పుడంతా జాగ్రత్తగా ఫ్రెష్ నీడిల్స్ వాడుతున్నారు.* స్త్రీలు రక్తం దానం చేయకూడదు అని వాదించేవారు లేకపోలేదు. పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు స్త్రీలు.

కాని అనేమియా సమస్య లేనంతవరకు, ఆరోగ్యకరమైన ఏ స్త్రీ అయినా, తన రక్తాన్ని దానం చేయవచ్చు.* 40 ఏళ్ళు దాటాక రక్తం దానం చేయకూడదు అని నమ్ముతారు కొందరు. అరవై ఏళ్ళ వరకు ఆరోగ్యకరంగా ఉన్న ఏ మనిషి అయినా రక్తాన్ని దానం చేయొచ్చు.* రక్తందానం వలన భరించలేని నొప్పి కలుగుతుందేమో అని భయపడతారు మరికొందరు.

నొప్పి గురించి అంత భయకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజులు కాస్త వీక్ గా ఉండవచ్చు అంతే.* రక్తందానం వలన ఒంట్లో రక్తం తగ్గిపోతుందనే అపోహ మరొకటి.

48 గంటల తరువాత మీ బ్లడ్ వెజెల్స్ అన్ని మామూలు అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే రక్త దానం చేయడం మీ ఒంటికే మంచిది.* ఏడాదికి ఒక్కసారే రక్తాన్ని దానం చేయలనే వాదన ఇంకొందరిది. కాని మూడు నుంచి ఆరు నెలల విరామంలో రక్తాన్ని దానం చేయవచ్చు.