కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

కైలాస పర్వతం. సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం.

 Interesting Facts About The Sacred Mount Kailasa Details, Mahashiva, Interesting-TeluguStop.com

యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు, జైనులకి, బుద్ధిస్టులకి కూడా అతిపవిత్రమైన పర్వతం.

ఏడాదికి వేలమంది సందర్శించే పుణ్యస్థలం.కాని మిగితా పుణ్యస్థలాలకి, దీనికి చాలా తేడా ఉంది.

ఈ పర్వతం మీద ఎన్నో వింతలూ విశేషాలు ప్రచారంలో ఉన్నాయి.అలాగే సాక్ష్యాలు కలిగిన నిజాలు ఉన్నాయి.

మూడు వందల కోట్ల మందికి పైగా ఆరాధించే ఈ పర్వతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

* ఈ పర్వతం యొక్క ఎత్తు 6.6 కిలోమీటర్లు. అవును ఎత్తు గురించే మాట్లాడుతున్నాం.

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలలో ఇది కూడా ఒకటి.

* ఎవరెస్టు పైదాకా వెళ్ళిన మనుషులు ఉన్నారు కాని కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన మనుషులు లేరు.

ఎందుకో … అది ఎవరికీ సాధ్యపడటం లేదు.జీవితంలో ఎలాంటి పాపాలు చేయనివారే ఈ పర్వతాన్ని పూర్తిగా ఎక్కగలరని ప్రయత్నించిన విదేశీయులు చెబుతుంటారు.

* ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కటి కంప్లయింట్ ఒక్కటే .మ్యాప్ లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే, అది మారిపోతూ ఉంటుంది.టెక్నాలజి పనికి రాకుండా పోతోంది అక్కడ.

Telugu Indian, Mahashiva, Mount Kailasa, Parvathi, Sacred Mountain, Shiva-Latest

* కైలాస పర్వతానికి దగ్గరగా వెళితే మన వెంట్రుకలు, గోళ్ళు చాలా తొందరగా పెరుగుతాయట.ఎంత త్వరగా అంటే, రెండు వారాల్లో పెరగాల్సినవి 12 గంటల్లో పెరుగుతాయి.దీని వెనుక రహస్యం ఎవరికీ అంతుపట్టడం లేదు.

* కైలాస పర్వతం నుంచి అప్పుడప్పుడు ఓ కాంతి వెలువడుతుంది.ఇది భక్తులు చెప్పిన మాట కాదు, ఇటు భారతీయ సైనికులు, అటు చైనా సైనికులు చెప్పిన సంగతి.

ఈ వింత సైన్స్ కి కూడా అర్థం కావడం లేదు.

* ఈ పర్వతం దగ్గర దేవుడి చెరువు, రాక్షసుడి చెరువు ఉంటాయి.

దేవుడి చెరువు అయిన మానసరోవరం ఎలాంటి విప్పత్తులు వచ్చినా చెక్కుచెదరకుండా అలానే ఉంటుంది.దాంట్లో నీళ్ళు చాలా స్వచ్చంగా ఉంటాయి.

ఇక్కడ మరో చెరువు నెలవంక ఆకారంలో ఉండటం విశేషం.

Telugu Indian, Mahashiva, Mount Kailasa, Parvathi, Sacred Mountain, Shiva-Latest

* మాన్సరోవర్ లో మునక వేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అని అంటారు.

* ఇక్కడ పార్వతిదేవి స్నానాలు ఆచరించిన పార్వతి కుండ్ కూడా ఉంటుంది.

* ఈ కైలాస పర్వత యాత్రని భారత ప్రభుత్వం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నడిపిస్తుంది.70 ఏళ్లకి తక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది.1.50 లక్షల నుంచి 1.70 లక్షల దాకా ఖర్చు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube