చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కృష్ణంరాజు       2018-07-03   00:47:02  IST  Bhanu C

తెలుగు సినిమా పాత తరం హీరో అయిన రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమా జీవితంతో పాటుగా రాజకీయ జీవితంలో కూడా ఒకానొక దశలో వెలుగొందారు..అయితే ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా సరే అప్పుడప్పుడు మీడియా ముందు ఎవో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఫోకస్ అవుతూ ఉంటారు ఆ తరువాత షరా మామూలే..అయితే ఏపీ నుంచీ బీజేపీ లో సీనియర్ లీడర్ గా ఉన్న కృష్ణం రాజు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు..వచ్చీ రాగానే చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు..

అయితే ఈ ఆరోపణల వెనుకాల ఎలాంటి స్వార్ధం ఉందనేది పక్కన పెడితే చంద్రబాబు ని మాత్రం ఏకి పడేశారు..పొత్తుల తరువాత బీజేపీని ఇబ్బంది పెట్టడం బాబు కి కొత్తేమి కాదు కదా అంటూ విమర్శించారు..అయితే గతంలోలాగా చంద్రబాబునాయుడు 20 గంటలకు పైగా ఇప్పుడు కూడ కష్టపడుతున్నాడని చెప్పారు. అయితే అప్పుడేమో ప్రజల కోసం కష్టపడ్డాడని, ఇప్పుడేమో అబద్దాలను నిజం చేయడం కోసం కష్టపడుతున్నాడని ఆయన ఆరోపించారు.

కేంద్రం పై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పోలవరం అంచనాలని తనకి నచిన రీతిలో పెచుకుంటూ పొతే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు..పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహరం కోసం తొలుత రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత దాన్ని రూ.30 వేల కోట్లకు పెంచారని ఆయన చెప్పారు…అసాధారణంగా పోలవరం నిర్వాసితుల పరిహరం ఎందుకు పెరిగిందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు…పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 600 హమీలు ఇచ్చారని అయితే వాటిలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ఆయన అన్నారు.

కేంద్రం పై ఒంటికాలిపై విరుచుకుపడే చంద్రబాబు కేంద్రం ఇస్తున్న నిధులని ఏ మేరకి ఖర్చు చేశారు..అనే విషయం వివరంగా చెప్పగలిగే దమ్ము ఉందా అని అడిగారు..మోడీపై, బీజేపీపై విమర్శలు చేసేందుకే ప్రస్తుతం బాబు సమయం వెచ్చిస్తునారని..పజలకోసం ఆలోచించే సమయం ఆయనకి ఎక్కడ ఉందని అన్నారు..ఏపీలో మళ్ళీ బాబు అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని జోస్యం చెప్పారు..రాజశేఖర్ రెడ్డి లాగానే జగన్ కూడా పాదయాత్రని ఎంతో దీక్షతో చేస్తున్నారని జగన్ పాదయాత్ర బాగుందని అన్నారు..