ఆగలేక బైక్‌పైనే రెచ్చిపోయిన జంట... పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు!

Unable To Stop, The Couple Who Got Angry On The Bike Were Booked Across The Police ,Bike,viral Latest, News Viral, Social Media,Uttar Pradesh, Bike Ride

నేటితరం ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు.తల్లిదండ్రులు ఏం చెప్పి పెంచుతున్నారో అర్ధం కావట్లేదు.

 Unable To Stop, The Couple Who Got Angry On The Bike Were Booked Across The Poli-TeluguStop.com

పాశ్చాత్య పోకడలకు పోయి అభాసుపాలవుతున్నారు.శృంగారం అనేది యెంత గోప్యంగా జరిగితే అంత అందం.

అలాంటిది పబ్లిక్ ప్లేసుల్లో కొందరు అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తున్నారు.దాంతో చుట్టూ వున్న జనాలు కూడా డిస్టర్బ్ అయిన పరిస్థితి.

పార్కుల్లో సంగతి సరేసరి, ఏకంగా బైకు రైడ్ చేస్తూ, రొమాన్స్ చేయడం సిగ్గు చేటుగా భావించాలి.ఇటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

తాజాగా చత్తీస్‌గఢ్‌, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట చేసిన శృంగారం సభ్య సమాజం తలదించుకునేలా వుంది.అవును, వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై అతనికి ఎదురుగా కూర్చొని ఉండటం గమనించవచ్చు.ఇంకేముంది ఒకవైపు డ్రైవ్ చేస్తూనే మరోవైపు ముద్దులతో రెచ్చిపోయారు.ఇది అభ్యంతరకరమే కాదు.చాలా ప్రమాదకరం కూడా.అలా నడిరోడ్డుమీద చేయడం వలన వాళ్లతోపాటు, పక్కన వెళ్లే వారికీ ప్రమాదకరమే.

ఈ జంట అలా బైకుపై వెళ్తుండగా, ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.బైకుపై ఉన్న జంటపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని పెద్దఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.దీంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు.

విచారణ జరిపిన పోలీసులు బైక్‌తోపాటు, జంటను అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

ఇక్కడ మరో విషయం బయటపడింది.ఈ వీడియోలో కనిపించిన బైక్ ఉత్తర ప్రదేశ్‌లో చోరీకి గురవ్వగా, దీని అసలు ధర రూ.1.50 లక్షలు అయితే దీన్ని ఆ వ్యక్తి రూ.9,000కే కొని వాడుతున్నాడు.దీనిపై కూడా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube