మొహమాటపడుతున్న జగన్ ... నష్టపోతున్న వైసీపీ ?

అన్ని విషయాల్లోనూ జగన్ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నారు.చెప్పినవన్నీ చేస్తున్నారు.

 Unable To Stop The Central Government Doing Injustice To The Ap-TeluguStop.com

చెప్పనివీ ఎన్నో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఏపీకి న్యాయంగా రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ నోరు మెదపకపోయినా, ఏపీకి అన్యాయం జరిగే విధంగా వ్యవహరించినా గట్టిగా నిలదీసి అడిగే పరిస్థితి అటు అధికార పార్టీ వైసిపి కానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, అలాగే అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వంను గట్టిగా నిలదీసి అడగలేక పోతున్నాయి.

ఈ విషయంలో మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా, అడగాల్సిన బాధ్యత మాత్రం జగన్ పైనే ఉంది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కేంద్రం ఏపీ విషయంలో సానుకూలంగానే ఉంటూ వచ్చింది.

 Unable To Stop The Central Government Doing Injustice To The Ap-మొహమాటపడుతున్న జగన్ … నష్టపోతున్న వైసీపీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగన్ కు అన్ని విధాల సహాయం చేస్తూ, ఆయనకు ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారి అపాయింట్మెంట్ జగన్ కు లభించేవి.కానీ ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైపోతోంది.

కేంద్రం అన్నిటినీ ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో ముందుకు వెళుతోంది.ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు ముందుకు వెళ్తుంది.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం తీరుపై విమర్శలు పెరిగిపోతున్నాయి.దేశ సంపదను మొత్తం అంబానీ, ఆదానీల చేతుల్లో పెట్టేందుకే బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కార్మికులు, మేధావులు, బిజెపి మినహా అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా , గట్టిగా ఈ విషయంలో పోరాడలేక పోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఏపీలో తమ ప్రభుత్వంపై తమ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు సిద్ధమైపోయారు.

Telugu Amith Sha, Ap Govrrnment Scheemes, Ap Special Status, Jagan, Janasena, Modhi, Pavan, Tdp, Vizag, Vizag Steel Plant-Telugu Political News

ఇవే కాకుండా, ఏపీకి రావాల్సిన వాటాలు, నిధుల విషయంలోనూ జగన్ కేంద్రంను నిలదీయలేకపోవడం, ఒకవేళ నిలదీస్తే వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న రాజకీయ భయం ఉండడం, తదితర కారణాలతో మౌనంగానే ఉండిపోతున్నారు.ప్రస్తుతం జగన్ కు, ఏపీకి తలకు మించిన భారంగా తయారైన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి, అది కాకుండా, తాము బిజెపితో వైరం పెట్టుకుంటే ఆ అవకాశం ఉపయోగించుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని , అదే జరిగితే రాజకీయంగా తమకు జరిగే నష్టం పూడ్చలేనిది అనే అభిప్రాయంతోనే జగన్ ఇంతగా మొహమాటపడుతూ, రాజకీయంగా వైసీపీ నష్టపోయే విధంగా వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

#Vizag #ApGovrrnment #Amith Sha #Jagan #Modhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు