అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించలేక కారులోనే నివాసముంటున్న మహిళ..!

ఒక మహిళ తనకు సొంత ఇల్లు ఉన్నా కూడా అందులో ఉండలేని పరిస్థితి వచ్చింది.తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించలేక తన కారులోనే నివాసం ఏర్పరుచుకుంది.

 Unable To Evict Deadbeat Tenant Due To Covid Laws Homeowner Ends Up Homeless-TeluguStop.com

కొన్ని నెలలుగా ఆమె నివాసం కారులోనే అసలు ఈమె ఎవరు ఎందుకు సొంత ఇల్లు ఉంచుకుని కూడా కారులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.తినడానికి తిండి కూడా లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మన దేశంలో ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగుపడినా కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికి లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు.

Telugu Car, York, York Acts-Latest News - Telugu

ఈ లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఒక మహిళ అవస్థ పడుతుంది.న్యూయార్క్ కు చెందిన ఎక్లెస్ అనే మహిళ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయింది.ఆమె ఉండే ఇంటికి అద్దె కట్టలేక తన సొంత ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని అక్కడకు వచ్చింది.

అయితే ఆమె ఇంట్లో వేరే వాళ్ళు అద్దెకు ఉంటున్నారు.వారిని ఖాళీ చేయాలనీ చెప్పిన వారు ఇప్పుడు ఖాళీ చేయనని చెప్పారు.

ఇప్పుడు న్యూయార్క్ లో కరోనా కొత్త నిభందనలు అమల్లోకి వచ్చాయి.వాటిని సాకుగా చూపించి ఆమెకు అద్దె కూడా చెల్లించడం లేదు.దీంతో ఆమె చేసేదేమీ లేక తన కారులోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు.కరోనా రాకముందు ఆమెకు నెలకు 2100 డాలర్లు వచ్చేవి.

కానీ కొన్ని నెలలుగా ఆమెకు అద్దె డబ్బులు రావడం లేదు.పైగా ఆమెకు ఉద్యోగం కూడా లేకపోవడంతో వేరే ఇంటికి అద్దెకు కూడా వెళ్లలేని పరిస్థితి.

దీంతో ఆమె తన ఇంట్లో ఉంటున్న వారిపై కోర్టుకెక్కింది.

తన ఇంట్లో ఉంటున్న వారు తనకు 14,700 డాలర్లు ఇవ్వాలని కోర్టుకు తెలిపింది.

కనీసం ఆ అద్దె డబ్బు ఇచ్చిన తాను మరొక ఇంటికి అద్దెకు వెళ్లేదానినని తెలిపింది.ఇప్పటివరకు తాను కష్టపడినా డబ్బులు మొత్తం ఆ ఇంటికే పెట్టానని ఇప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేవని ఆమె వాపోయింది.

అందుకే కారులోనే నివాసం ఏర్పరుచుకుని జీవిస్తున్నానని కోర్టులో తెలిపింది.చూడాలి మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube