ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకున్న హీరోయిన్.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు లక్షల్లో, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ సంతోషకరమైన జీవనం సాగిస్తారని చాలామంది భావిస్తారు.అయితే హీరోయిన్ల నిజ జీవితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి.

 Unable To Bear The Harrassment The Heroine Committed Suicide,  Bigg Boss Show ,-TeluguStop.com

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న చైత్రా కుటూర్ ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు.ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా కావడం గమనార్హం.

చైత్రా కుటూర్ ఆత్మహత్యకు ఆమె వివాహం చేసుకున్న వ్యక్తే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితం చైత్రా కుటూర్ నాగార్జున అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రం తనకు చైత్రతో వివాహం జరగడం వాస్తవమే అయినా చైత్రను తాను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదని నాగార్జున చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss Show, Chaitra Kutoor, Kannada-Movie

నాగార్జున బిజినెస్ మేన్ కాగా పెళ్లి తరువాత ఎదురైన సమస్యల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె సూసైడ్ కు కారణమైన వ్యకిని అదుపులోకి తీసుకుకునే ప్రయత్నం చేస్తున్నారు.చైత్ర ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నా ఆమె కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

చైత్ర కుటూర్ ఆత్మహత్యాయత్నం చేయడం కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.చైత్రా కుటూర్ ను పెళ్లి చేసుకోవడం నాగార్జున ఇంట్లో ఇష్టం లేదని సమాచారం.

ఈమెను కోడలిగా అంగీకరించడానికి అత్తింటి వాళ్లు ఇష్టపడలేదని తెలుస్తోంది.తీవ్ర మనస్తాపం చెందిన చైత్ర ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం.

సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.పోలీసులు నాగార్జునను అదుపులోకి తీసుకొని చైత్ర ఆత్మహత్యాయత్నానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube